తెలంగాణాలో లాక్ డౌన్ ని పొడిగిస్తున్నట్టు తెలంగాణా సిఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. తెలంగాణాలో లాక్ డౌన్ ని మే 29 వరకు విధిస్తున్నామని కేసీఆర్ పేర్కొన్నారు. అందరూ కూడా దీన్ని కచ్చితంగా ఫాలో అవ్వాలని ఆయన వివరించారు. కర్ఫ్యూ రాష్ట్ర వ్యాప్తంగా అమలు అవుతుందని, కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా లాక్ డౌన్ ని పెంచుతున్నామని ఆయన స్పష్టం చేసారు.
ప్రజలు అందరూ కూడా లాక్ డౌన్ ని పాటించాలని, అనవసరంగా బయటకు రావొద్దని ఆయన హెచ్చరించారు. పలు టీవీ చానల్స్ సర్వేల్లో లాక్ డౌన్ ని పెంచాలి అని ప్రజలు కోరుతున్నారని ఆయన కొన్ని చానల్స్ పేర్లను ప్రస్తావించారు. మే 29 వరకు లాక్ డౌన్ చాలా అవసరమని 65 ఏళ్ళు దాటిన వారు బయటకు రావొద్దని కేసీఆర్ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసారు. లాక్ డౌన్ విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేసారు.
ఇంకొన్ని రోజులు ఓపిక పడితే పూర్తిగా కరోనా వైరస్ ని కట్టడి చేస్తామని, ఎక్కడా కూడా షాపులు ఉండవని, కేవలం నిర్మాణ సంబంధ వ్యాపారాలు మాత్రమే జరుగుతాయని, కేంద్రం మార్గదర్శకాలు కచ్చితంగా అమలు చేస్తామని ఆయన పేర్కొన్నారు. ప్రజలు అందరూ అర్ధం చేసుకోవాలని రాత్రి 7 గంటల నుంచి కర్ఫ్యూ అమలు చేస్తామని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని ఆయన పేర్కొన్నారు.
ప్రజలు పని లేని పనికి బయటకు రాకుండా ఉండాలని చెప్పారు. దేశానికి ఆహారం పెట్టే సామర్ధ్యం మరో దేశానికి లేదని వ్యవసాయ ఉత్పత్తులు అన్నీ కూడా కొనసాగుతాయని, వ్యవసాయ యంత్రాలకు సంబంధించిన పరికరాలు, ఎరువుల షాపులు తెరిచే ఉంటాయని ఆయన తెలిపారు. వ్యవసాయ సంబంధిత షాపులు అన్నీ కూడా ఉంటాయని అన్నారు. కేంద్రం రెడ్ జోన్స్ లో షాపులు తెరుచుకోవచ్చు అని చెప్పింది అని కాని తెరవడం లేదని చెప్పారు.
హైదరాబాద్ లో లాక్ డౌన్ ని కచ్చితంగా అమలు చేస్తామని మరో మార్గం లేదని చెప్పారు. హైకోర్ట్ ఆదేశాలతో పది తరగతి పరిక్షలు నిర్వహిస్తామని చెప్పారు. రేపటి నుంచి ఆర్టీయే ఆఫీసులు కూడా పని చేస్తాయని, ఇసుక మైనింగ్, ప్రభుత్వ కార్యాలయాలు పని చేస్తాయని పేర్కొన్నారు. కోవిడ్ సూచనలతో పది పరిక్షలు నిర్వహిస్తామని వివరించారు. అలాగే ఇంటర్ వాల్యువేషణ్ ని కూడా పూర్తి చేస్తామని అన్నారు.