గొర్రెలు, మేకల ఎరువుతో నేలకు జీవం.. వీలైతే ఇలా చేసేయండి..!

-

భూమిలో నేల సారాన్ని పెంచడంలో గొర్రెలు, మేకల ఎరువుకు అధిక ప్రాధాన్యం ఉంది. ఈ ఎరువు విక్రయం రైతులకు మెరుగైన రాబడులనూ తెచ్చిపెడుతోంది. జీవాల ఎరువుతో కలిగే ప్రయోజనాలు ఏంటో ఈరోజు చూద్దాం..
రసాయన వ్యవసాయంలో తినే తిండి మాత్రమే కాదు భూసారం కూడా పాడవుతోంది. దీనికి రసాయన రహిత వ్యవసాయం ఒక్కటే పరిష్కార మార్గం. ఈ సమస్యలు గొర్రెల ఎరువు, కోళ్ల ఎరువు, కంపోస్టు, వర్మి కంపోస్టు, సేంద్రియ ఎరువులు, భూసారాన్ని పెంచడానికి ఉపయోగాపడతాయి. నీటివసతి ఉన్న భూములే కాదు వర్షాధారిత పంట భూముల్లో సేంద్రియ పదార్థం ఎంత ఎక్కువ వేస్తే అంత మంచిది.
వ్యవసాయ క్షేత్రంలో గొర్రెలు, మేకలు మందలు వదిలితే…మందుల వల్ల పేడ, మూత్రం, వెంట్రుకల వల్ల భూమికి సేంద్రియ పదార్థం లభిస్తుంది. ఈ గొర్రె పేడలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది కాబట్టి.. మొక్క వేర్లు ఈ పేడ చుట్టూ చొచ్చుకుపోతాయి. పేడలో ఉపయోగకర సూక్ష్మజీవులు ఉండి ఇవి జీవన ఎరువులుగా పనిచేస్తాయి.

గొర్రెలు, మేకల మూత్రం, వల్ల భూమికి వచ్చే ఉపయోగాలు

గొర్రెలు, మేకల మూత్రం pH విలువ 7.7 ఉంటుంది కాబట్టి.. గొర్రెలు, మేకలు మందలు వేస్తే చౌడు భూములు సహితం సారవంతంగా మారుతాయి. ఒక లీటరు మూత్రంలో 3 నుంచి 13 గ్రాముల నత్రజని, 18 నుంచి 20 గ్రాముల పొటాషియం, ఫాస్పరస్ మొదలైన మూలకాలుంటాయి. ఒక గొర్రె ఒక రాత్రి ఒక లీటరు మూత్రం విసర్జిస్తుంది. అంటే పంట భూముల్లో గొర్రెలు, మేకల మందలను ఉంచటం వల్ల మూత్రం వృథా కాదు.
గొర్రెలు, మేకల పేడ ఉండలు ఉండలుగా అనగా గుండ్రంగా ఉండటం భూమికి చాలా మేలు చేస్తుంది. భూమి మట్టిలో కొంతభాగం అక్రమించుకుంటాయి గనుక భూమి గుల్లబారుతుంది. ఈ పేడ ఉండలు పేడ గట్టిగా ఉండటం వల్ల భూమిలో కలవాలంటే కొంత కాలం పడుతుంది. స్పాంజ్ వలే నీటిని పీల్చుకొని, భూమిలో తడి శాతం తగ్గకుండా క్రమేపి ఈ పేడ నుంచి తడిని మొక్కలు పొందుతుంటాయి. గొర్రెలు/ మేకల పేడలో 0.5-0.7 నత్రజని, 0.4-0.6 భాస్వరం, 0.1-3.0 పొటాష్ ఒక రోజుకు గొర్రె 360 నుంచి 540 గ్రాములు, మేక 900 గ్రాముల వరకు పేడను విసర్జిస్తాయి.
గొర్రెలు, మేకల పేడలో బ్యాక్టీరియాలు, ప్రోటోజోవా, ఫంగి, మొదలైన ఉపయోగకర సూక్ష్మజీవుల వల్ల భూమిలో పేడ పులిసి ఎరువుగా మారుటకు, పంట తీసిన తర్వాత వ్యవసాయ ఉప ఉత్పత్తులైన చొప్పగడ్డి, కలుపు జీవరాశులు చనిపోతున్నాయి. నేల బండబారి, నీటిని నిలుపుకొనే శక్తిని మొదలైన వాటిలో ఉన్న సెల్యులోజ్, హేమీ సెల్యులోజ్, లిగ్నిన్ని నేలలో కోల్పోయి, సేంద్రియ కార్బన్ తగ్గి సూక్ష్మజీవుల ఉనికి ప్రశ్నార్థకంగా ఎరువుగా మార్చుటలో ఈ సూక్ష్మజీవుల ప్రాముఖ్యత ఉంది.
మొక్కలకు కావాల్సిన అన్ని పోషకాలు ఇందులో లభ్యమవుతాయి. పోషకాల సమతుల్యత ఉంటుంది.
భూమిలో ఉపయోగకరమైన సూక్ష్మజీవులు వృద్ధి చెందుతాయి. నేల సహజ సిద్ధమైన ఆరోగ్యం కలిగి ఉంటాయి.
 గొర్రెలు, మేకల మందలు (పెన్నింగ్) పంట భూముల్లో వేయటం వల్ల నీటితడి పెట్టాలి. పంట ఉత్పత్తుల నాణ్యత పెరుగుతుంది. వాటికీ మంచి రంగు, రుచి, వాసన, రవాణలో నిల్వ వుండే గుణం పెరుగుతుంది.
జీవవైవిధ్యాన్ని కాపాడుతూ పైరుకే కాకుండా తర్వాత 2-3 పైర్లపై దీని ప్రభావం ఉంటుంది..
అతి తక్కువ నీటితో ఆరోగ్యకరమైన పంటలు పండించవచ్చు. భూమిలో సేంద్రియం పెరగటానికి విరివిగా గొర్రె మందలు రైతులు పంట భూముల్లో వేయించాలి. సేంద్రియ పదార్థం పెరిగిన తర్వాత అందులో జీవనం కొనసాగించే సూక్ష్మజీవులకు అవసరమైన ఆహారాన్ని అందించగలిగితే.. భూమిలో ఉండే వానపాములు వాటంతట అవే అభివృద్ధి చెందుతాయి.. భూమిలో వానపాములు అభివృద్ధి చెందినట్లయితే అవి నేలను గుల్లపరచటంతో భూమి తనంతట తానె మల్చింగ్ చేసుకుంటుంది. వరి, మొక్కజొన్న, మామిడి, జామ, సపోట, అరటి, బొప్పాయిలతో పాటు చాలా రకాల పూలను కూడా పండించుకోవచ్చు.
పంట భూములు, తోటల్లో గొర్రెలు, మేకల మందలు వేసిన తర్వాత దుక్కి దున్నాలి. నీటివసతి ఉంటే దుక్కి దున్నిన తర్వాత ఒక నీటితడి పెట్టడం మర్చిపోవద్దే.

Read more RELATED
Recommended to you

Latest news