బంగ్లాదేశ్‌ తాత్కాలిక ప్రభుత్వాధినేతగా యూనస్‌కు పగ్గాలు

-

బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా ప్రభుత్వం కుప్పకూలిన తర్వాత తాత్కాలిక ప్రభుత్వం కొలువుదీరింది. ఈ నేపథ్యంలో తాత్కాలిక ప్రభుత్వానికి నోబెల్‌ శాంతి పురస్కార గ్రహీత మహమ్మద్‌ యూనస్‌ నేతృత్వం వహించనున్నారు. షేక్‌ హసీనా రాజీనామా తర్వాత అధ్యక్షుడు మొహమ్మద్‌ షహబుద్దీన్‌ మంగళవారం రోజున పార్లమెంటును రద్దు చేసి తాత్కాలిక పరిపాలన యంత్రాంగం ఏర్పాటుకు అనుమతించారు.

ఈ నేపథ్యంలో మహమ్మద్‌ యూనస్‌ బంగ్లాదేశ్‌ ప్రభుత్వాధినేతగా నియమించారు. మంగళవారం అర్ధరాత్రి సమయంలో అధ్యక్షుడు మొహమ్మద్‌ షహబుద్దీన్‌ ఈ ప్రకటన చేశారు. యూనస్‌ స్కాట్లాండ్‌లోని గ్లాస్గో కాలెడోనియన్‌ విశ్వవిద్యాలయానికి వీసీగా.. చిట్టగాంగ్‌ విశ్వవిద్యాలయంలో ఆర్థికశాస్త్ర ఫ్రొఫెసర్గా సేవలందించారు. మైక్రోఫైనాన్స్‌ బ్యాంక్‌ ద్వారా బంగ్లాదేశ్లో లక్షల మంది ప్రజలను పేదరికం నుంచి బయటపడేసిన ఘనత సాధించినందుకు గాను 2006 లో నోబెల్‌ శాంతి బహుమతి అందుకున్నారు. అయితే తాత్కాలిక బంగ్లాదేశ్‌ ప్రభుత్వ సారథిగా యూనస్ పేరును నిరసన కారులే ప్రతిపాదించారు. సైనిక సర్కారును, సైన్యం మద్దతు ఉండే మరేదైనా సర్కారును అంగీకరించేది లేదని స్పష్టం చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version