గత కొన్ని రోజులుగా దేశం మొత్తం టమోటాలు ధరలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఒక కిలో టమోటాలు కొనాలంటే రూ. 100 కు పైగా ఖర్చు చేయాల్సి వస్తోంది. ఈ మధ్యన కొన్ని రాష్ట్రాలలో కేజీ టమోటా రూ. 150 కు పైగానే పలికింది. టమోటా లేకుండా ఏ కూర కూడా చేయడం వీలు అవదు , అందుచేత సామాన్యులు ముఖ్యంన్గా ఈ టమోటాలను చాలా పొదుపుగా వాడుకుంటున్నారు. ఇక తాజాగా టమోటా ల ఉపయోగంపై నిర్వహించిన ఒక సర్వే లో కీలక విషయం ఒకటి బయటపడింది. ధరలు అమాంతం పెరగడం వలన దాదాపుగా దేశంలో 14 శాతం మంది టమోటాలను కొనడమే మానేశారట. ఇంకా 68 శాతం టమోటాలు వాడకాన్ని బాగా తగ్గించేశారట. ఇందులో 87 శాతం మంది ఒక కిలో టమోటాను కొనడం కోసం రూ. 100 కంటే ఎక్కువ డబ్బును పెడుతున్నారట.
గత నెలలో ఒక కిలో టమోటా ధర కేవలం రూ. 20 నుండి 30 వరకు మాత్రమే ఉండగా, జులై లో దాదాపుగా 326 .13 శాతం పెరిగి పోయింది. మీ విషయానికి వస్తే.. మీ ఇంట్లో నిజంగానే టమోటాలు వాడుతున్నారా ? వాడితే ఎన్ని వాడుతున్నారు ?