ప్రతిఒక్క సామాన్యుని జీవితంలో ఒక కల ఉంటుంది, ఎలాగైనా సొంత ఇల్లును నిర్మించుకోవాలి అని… ఇందుకోసం జీవితమంతా కస్టపడి పొదుపు చేసుకుని దానికి తోడు వడ్డీలకు అప్పు చేసి ఇల్లు నిర్మించుకుంటారు. ఈ సమయంలో చాలా మనఃది బ్యాంకుల నుండి అతి తక్కువ వడ్డీలకు వచ్చే రుణాల గురించి తెలియక బయట ఎక్కువ వడ్డీలకు డబ్బు తీసుకుని ఇబ్బంది పడుతుంటారు. ఇక తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా వారు సొంతింటిని నిర్మించాలి అనుకునే వారికి హోమ్ లోన్స్ ను ఆఫర్ వడ్డీ ద్వారా ఇవ్వడానికి ఒక స్కీం పెట్టింది. హోమ్ లోన్ తీసుకునే వారికి ప్రాసెసింగ్ ఫీజులో 50 నుండి 100 శాతం డిస్కౌంట్ ను ఇస్తోంది.
అంతే కాకుండా ఈ ఆఫర్ కేవలం ఆగష్టు నెలాఖరు వరకు మాత్రమే ఉండనుంది. మరియు సిబిల్ స్కోర్ 750 ఉన్న వారికి వడ్డీ రేట్ 8 .70 శాతంగా మరియు సిబిల్ 700 – 749 గా ఉన్న వారికి వడ్డీ రేట్ 8 .80 శాతంగా ఇవ్వనున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం మీకు దగ్గరలో ఉన్న స్టేట్ బ్యాంక్ ను సంప్రదించండి.