కోళ్ళ ఎరువు వాసన రాకుండా ఉండాలంటే ఇలా చెయ్యాలి..!!

-

కోళ్ల ఫారాల ఎక్కడో దూరంగా ఉన్న దుర్వాసన మాత్రం మన పక్కనే వున్నట్లు వస్తుంది.అందుకే సిటీకి దూరంగా వాటిని ఏర్పాటు చేస్తారు..అక్కడకు వెళ్ళి చూస్తే మాత్రం జీవితంలో చికెన్ ను తినరు.అంతలా ఆ వాతావరణం ఉంటుంది.ఈ నేపధ్యంలో సమస్య పరిష్కారం కోసం బ్లాక్‌ సోల్జర్‌ ఫ్లై ఎంతగానో కోళ్ల రైతులకు మేలు కలిగించేదిగా మారింది. దీనివల్ల వాసన మరియు ఈగల సమస్య నుండి బయటపడటముతో పాటు కోడి ఎరువును పోషకాల గనిగా మార్చటంలో ఈ బ్లాక్‌ సోల్జర్‌ ఫ్లై బాగా ఉపయోగపడుతుంది. దీంతో పాటుగా దాణా ఖర్చులు తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

బ్లాక్‌ సోల్జర్‌ ఫ్లై పర్యావరణానికి ఉపయోగపడే ఈగ.ఇవి మామూలుగా మన చుట్టు ప్రక్కల కనిపించే ఈగల వంటివి కావు. ఈ ఈగలు పశువులు, కోళ్ళ వ్యర్థాలను కుళ్ళగొట్టి మంచి పోషకాలు గల ఎరువుగా మార్చేందుకు దోహదపడతాయి. సాధారణంగా కోళ్ళ ఎరువు వాసన వస్తుంది. కాని కోళ్ళ వ్యర్థాలలో ఈ బ్లాక్‌ సోల్జర్‌ ఫ్లై లార్వాను వదలితే కేవలం 45 రోజులలో మంచి ఎరువుగా మార్చి కోళ్ళ ఎరువును ఎలాంటి వాసన లేకుండా చేస్తాయి.

లేయర్స్‌ కోళ్ళ ఫారమ్‌లలో పైన ఉన్న కోళ్ళు కిందకు రెట్టను వదులుతుంటాయి. ఈ రెట్టలో బ్లాక్‌ సోల్జర్‌ ఫ్లై యొక్క లార్వాలను వదులుతారు. ఈ లార్వాలు కోళ్ళ వ్యర్థాన్ని కుళ్ళగొడతాయి. 45 రోజులలో మంచి ఎరువుగా తయారవుతుంది. పూర్తిగా తయారయిన ఎరువు వాసన లేకుండా, తగు మొత్తంలో తేమ శాతంలో పొడి పొడిగా ఉంటుంది. పొడిగా ఉన్న ఎరువును జల్లెడపోసి లార్వాలను వేరు చేసి ఆ లార్వాను కోళ్ళకు దాణాగా వేస్తుంటారు..

ఇలా చెయ్యడం వల్ల కోళ్ల ఫారాల లో వాసన తగ్గి పర్యావరణం శుద్ధి పడుతుంది..అంతేకాదు దానా ఖర్చులు కూడా తగ్గుతాయి. కోళ్ళ ఆరోగ్యం మెరుగుపడడం, కోడిగుడ్లలో పోషకాల శాతం పెరగడం లాంటివి జరుగుతుంటాయి. కాబట్టి బ్లాక్‌ సోల్జర్‌ ఫ్లై ఈగలు రైతుల పాలిటి ప్రత్యేకించి కోళ్ళ రైతుల పాలిటి వరంగా చెప్పవచ్చు..ఈ ఎరువుల వల్ల పంటలకు మంచి పోషకాలను అందించి అధిక దిగుబడి పొందెందుకు ఉపయోగపడుతుంది..

Read more RELATED
Recommended to you

Exit mobile version