మిరియాల సాగుతో చక్కటి లాభాలు.. శ్రమ కూడా తక్కువే..!

-

ఈ మధ్య కాలంలో చాలా మంది వ్యవసాయంపై దృష్టి పెడుతున్నారు. ఉద్యోగాన్ని కూడా వదులుకుని పంటలు పండించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. మీరు కూడా ఏదైనా పంట పండించాలని అనుకుంటున్నారా..? దాని ద్వారా మంచిగా డబ్బు సంపాదించాలనుకుంటున్నారా..? అయితే మిరియాల సాగు గురించి చూడాలి.

 

ప్రపంచంలో మిరియాల ఉత్పత్తిలో భారతదేశం మొదటి స్థానంలో ఉంది. వ్యవసాయ రంగంలో దీనికి డిమాండ్ ఎక్కువగా పెరుగుతుంది. పైగా మిరియాల ని మనం ఎక్కువగా వాడుతూ ఉంటాం కూడా. ఈ సాగు చేస్తే చక్కగా డబ్బులు వస్తాయి. పైగా ఎక్కువ శ్రమ కూడా పెట్టాల్సిన పనిలేదు. మహారాష్ట్ర, అస్సాం, కర్ణాటక, చతిస్గడ్ వంటి రాష్ట్రాలలో ఎక్కువగా దీనిని సాగు చేస్తున్నారు.

మందుల్లో కూడా మిరియాలని ఉపయోగిస్తూ ఉంటారు. మన దేశంలో ఉత్పత్తి అయ్యే వివిధ రకాల మసాలా దినుసులు కి విదేశాలలో డిమాండ్ ఎక్కువగా ఉంది వీటిని సాగు చేస్తే చక్కగా రాబడి వస్తుంది. మిరియాల సాగును ప్రోత్సహించేందుకు కృషి విజ్ఞాన కేంద్రంలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

రైతులు ఎలా మొక్కలు నాటాలి వంటివాటిని చెప్తున్నారు. దీంతో ఎవరైనా సరే సులభంగా మిరియాల సాగును చేపట్టవచ్చు. ఈ సాగు ద్వారా లాభాలు రెట్టింపు లో వస్తాయి 10 నుంచి 15 వేల వరకు ప్రతి నెలా పొందొచ్చు. మార్కెట్లో డిమాండ్ ఎక్కువ ఉంటే అప్పుడు మరింత ఎక్కువ డబ్బులు మీరు పొందవచ్చు. ఇలా తక్కువ శ్రమతో మిరియాలను పండించి రైతులు అద్భుతమైన లాభాలను పొందవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news