వేరు శనగ సాగు చేస్తున్నారా..? విత్తనాలు, ఎరువులు, ఎప్పుడు సాగు చెయ్యాలి మొదలైన వివరాలివే..!

-

రైతులు ఏదైనా పంటను సాగు చేయాలంటే కచ్చితంగా దాని గురించి పూర్తి అవగాహన ఉండాలి. తొలకరి వర్షాలు పడినప్పుడు సాధారణంగా రైతులు విత్తనాలు వేస్తారు. అయితే వేరుశనగ విషయంలో ఎలా రైతులు అనుసరించాలి..?, వేరుశనగ సాగు ఎలా చేయాలి అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

తొలకరి జల్లులు పడగానే వేరుశనగ విత్తనాలు కూడా నాటాలి. ఎక్కువగా వేరుశనగ పంటను తెలంగాణ ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ ప్రాంతంలో సాగు చేస్తారు. కోస్తాలో వేరుశనగ సాగు తక్కువగా ఉంటుంది. ఒకసారి విత్తనాలు వేసిన తర్వాత పంట నూర్పిడి వరకు జాగ్రత్తగా చూసుకోవాలి. అప్పుడే అధిక దిగుబడులు వస్తాయి.

ఎప్పుడు వేరుశనగ వేసుకోవాలి..?

జూలై నెల వరకు వేరుశనగ విత్తనాలు వేసుకోవచ్చు. వర్షాలు కనుక ఆలస్యంగా కురిసినట్టైతే ఆగస్టు వరకు కూడా వేసుకోవచ్చు.

వేరుశనగ ని ఎలా వెయ్యాలి..?

నారాయణ, కెసిఆర్, ధరణి వంటి వాటిని వేసుకునే వారు వరుసల మధ్య 30 సెంటీమీటర్లు మొక్కల మధ్య 10 సెంటి మీటర్ల దూరాన్ని పాటించాలి. ఒకవేళ కనుక ఐసీజీయస్-14, 44 వంటి రకాలను వేసుకుంటే 30 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 15 సెంటీమీటర్ల దూరంలో ఉంచాలి. భూమిలో తగినంత తేమ ఉండాలి. అలానే విత్తనాన్ని ఐదు సెంటీమీటర్ల లోతు మించకుండా వేసుకోవాలి.

ఎరువుల యాజమాన్యం:

ఆఖరి దుక్కిలో అయితే ఎకరానికి 4 టన్నుల బాగా కుళ్లిన పశువుల ఎరువు, 16 కిలోల భాస్వరం, 8 కిలోల నత్రజని, 20 కిలోల పొటాష్ వేసుకోవాలి. ఇది ఇలా ఉంటే పూత దశలో లేదా కలుపు తీసే ముందు ఎకరానికి 200 కిలోల జిప్సం వెయ్యాలి. అప్పుడు వేరుశనగ బాగుంటుంది. పెద్దగా ఉంటుంది.

వేరుశనగ పంటకి కలిగే నష్టాలు:

వేరుశనగ పైరును వేరు పురుగు, పేనుబంక, తామర పురుగు, పచ్చదోమ, ఆకుముడత పురుగు, ఎర్ర గొంగళి పురుగు, శనగపచ్చ పురుగు, లద్దె పురుగు అధికంగా ఉంటాయి. కనుక మందుని పిచికారీ చెయ్యాలి.

కలుపు నివారణ:

విత్తనాలు వేసిన వెంటనే కానీ మూడు రోజులకి కానీ ఎకరానికి 200 లీటర్ల నీటిలో 1.3-1.6 లీటర్ల పెండిమిథాలిన్ 30% లేదా లీటరు అలాక్లోర్ లేదా 1.25-1.5 లీటర్ల బుటాక్లోర్ కలిపి స్ప్రే చేయాలి. కలుపు మొక్కలు కన్పిస్తే 21 రోజుల లోపు ఎకరానికి 200 లీటర్ల నీటిలో 400 మిల్లీలీటర్ల క్విజలాఫాప్ ఇథైల్ కలిపి స్ప్రే చెయ్యాలి. ఇలా ఇవి లేతగా వున్నప్పుడే తొలగించాలి. లేదంటే తరవాత ఏ ఫలితం ఉండదు.

Read more RELATED
Recommended to you

Latest news