ముల్లంగి సాగుకు అనువైన నేలలు , మేలైన విత్తన రకాలు ..

-

ఇండియాలో ముల్లంగి సాగు రైతులకు లాభసాటి పంటే.. దీర్ఘకాలిక రోగాలనై.. బీపీకి ఇది మంచి ఫుడ్. ఇంకా సలాడ్స్, సంబార్లలో కూడా ముల్లంగి ఎక్కువగా వాడుతుంటారు.. ముల్లంగి విత్తిన 30 రోజుల తర్వాత స్వచ్ఛమైన తెల్లటి సన్నని, లేత ముల్లంగి కాండం చేతికందుతుంది. ఈరోజు ముల్లంగి సాగుకు అనువైన విత్తన రకాలు, నేలలు ఏంటో చూద్దాం.!

విత్తన రకాలు..

ముల్లంగి విత్తన రకాలకు సంబంధించి పూసా హిమాని, రాపిడ్ రెడ్ వైట్ టిప్డ్, గ్లోబులర్ రకాలు అవి 26 రోజుల్లో కోతకు సిద్ధంగా ఉంటాయి. ఉష్ణమండల రకాలైన జపనీస్ తెలుపు ఉష్ణోగ్రత తక్కువగా ఉన్నప్పుడు మూలాలు మెరుగ్గా పెరుగుతాయి, తెల్లగా ఉంటాయి.
30 నుండి 45 సెం.మీ పొడవు మొద్దుబారిన చివరతో స్వల్పంగా ఘాటుగా ఉంటాయి.
పూసా దేశి రకం విషయానికి వస్తే వేర్లు జపనీస్ రకానికి చెందిన వాటి పరిమాణంలో ఉంటాయి, ఆకుపచ్చని కాండం చివరను కలిగి ఉండి ఘాటుగా ఉంటాయి.
ఆగస్టు ప్రారంభంలో విత్తడానికి అనుకూలంగా ఉంటాయి. పూసా చెట్కి రకం ఇది కాండం తెల్లగా ఉంటుంది. మార్చి, ఆగస్టు వరకు విత్తడానికి అనుకూలంగా ఉంటాయి. 40 నుండి 45 రోజులలో వేర్లు కోతకు సిద్ధంగా ఉంటాయి. పూస రేష్మి రకం వేర్లు 30 నుండి 35 సెం.మీ పొడవుతో తెల్లగా కుచించుకుపోయి ఆకుపచ్చని కాండం చివర ఉంటుంది. సెప్టెంబరు నెలలో దీనిని విత్తడానికి అనుకూలం.

అనువైన నేలలు..

ముల్లంగి వేడిని తట్టుకుంటుంది కాబట్టి.. ముల్లంగిని అన్ని రకాల నేలల్లో పండిస్తారు, అయితే తేలికైన నేలలు ఈ పంటకు అనుకూలంగా ఉంటాయి. ఇసుకతో కూడిన నేలలు, ఆమ్ల నేలల్లో కూడా ముల్లంగిని పండించవచ్చు.

విత్తే విధానం..

ముల్లంగిని 45 సెం.మీ దూరంలో ఉన్న గట్ల మీద విత్తుతారు. 22 సెం.మీ ఎత్తులో 1.25 సెం.మీ లోతులో ఒక చిన్న గాడిని తయారు చేసి… మెత్తని ఇసుక లేదా ముతక మట్టితో కలిపి చేతితో సాళ్లలో విత్తాలి.. విత్తిన వెంటనే మొదటి నీటిపారుదల, తదుపరి నీటిపారుదల వారానికి ఒకసారి ఇవ్వొచ్చు. రెండుసార్లు కలుపు తీయాల్సి ఉంటుంది. మూలాలు లేతగా ఉన్నప్పుడు ముల్లంగిని కోయాలి.

తెగుళ్లు..

ముల్లంగి ఆకులు లేతగా, అలాగే మూలాలలో చిన్న ఖాళీలు అలాగే పొడవైన కమ్మీలు కనిపిస్తే అవి మార్గోట్స్‌ బారిన పడినట్లు గుర్తించాలి. ఈ చిన్న కీటకాలు మొక్కల పక్కనున్న నేలలో గుడ్లు పెడతాయి. వాటిని తొలగించడానికి వ్యవసాయ నిపుణుల సూచనలను పాటించాలి.
ముల్లంగి ఆకులు వడలిపోయి పసుపు రంగులోకి మారితే అఫిడ్‌ మైకోఫ్లాస్మా వైరస్‌ వల్ల కలిగే వ్యాధి అని గుర్తించాలి. ఇలాంటి మొక్కలను గుర్తిస్తే..ఆ మొక్కలను తొలగించాలి.

Read more RELATED
Recommended to you

Latest news