రైతులకు అదాయానిచ్చే సుబాబుల్ సాగు..ఈ విషయాల్లో జాగ్రత్త

-

సొంత భూమి ఉంటే..సుబాబుల్ సాగు చాలా మంచిది. అన్ని ఉష్ణమండల ప్రాంతాలలో సహజసిద్ధంగా పెరుగుతుంది. ఈ చెట్టుకి పూసే పువ్వులు తెల్లని కేశరములతో గుండ్రంగా ఉంటాయి. దీనిని వంటచెరకుగా, నారగా, పశువుల మేతగా ఉపయోగిస్తారు. త్వరగా పెరిగే బహువార్షిక మొక్కగా సుబాబుల్ ను చెప్పవచ్చు. దీని కలపను పనిముట్ల తయారీకి, కాగితపు గుజ్జు లాంటి అవసరాలను వినియోగిస్తారను మనకు తెలిసిందే..

సుబాబుల్ విత్తనాలలో మాంసకృత్తులు అధికంగా ఉంటాయి. విత్తనాలు సులభంగా మొలకెత్తుతాయి. వర్షాభావ పరిస్థితుల్లో మొక్కలు బాగా పెరుగుతాయి. గాలిలో ఉన్న నత్రజనిని ఉపయోగించుకునే శక్తిగల బాక్టీరియా ఈ మొక్కలు వేరుబుడిపెల్లో ఉంటుందగి. చెట్టును నరికినా తిరిగి కొమ్మలు వస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో దీనిని సాగు చేసుకునేందుకు అనుకూలంగా ఉంటుంది.

ఏ రకమైన నేల మంచిది?

అన్నిరకాల తటస్థ నేలల్లోనూ ఇది పెరుగుతుంది. క్షార , ఆమ్ల నేలల్లో పెరగదు. లోతైన, సారవంతమైన మరియు ఎక్కువ తేమ లభ్యమయ్యే నేలలు అనుకూలమైనవి. బంజరు భూముల్లోను, చెరువు గట్లపైన, పశువుల తాకిడి లేని కాలువ గట్లపైన, పొలాల గట్లపైన ఇది పెంచవచ్చు. అటవీ వ్యవసాయంగా పంటపొలాల్లో కూడా పెంచవచ్చు. కలప గట్టిగా, నాణ్యంగా ఉంటుంది. భవన నిర్మాణానికి, ఫర్నీచర్ తయారీకి ఉపయోగపడుతుంది. గుంజలు, కంచె స్థంభాలుగా ఉపయోగపడతాయి. కొమ్మలు వంటచెరుకుగా పనికివస్తాయి. ఆకులు పశుగ్రాసంగా ఉపయోగపడతాయి. ఇలా మొక్కలో ప్రతిపార్ట్ ఉపయోగపడేదే..

కలుపు నివారణ..

కలుపు నివారణ మొదటి 2 సంవత్సరముల వరకు చేయాలి. అవసరాన్ని బట్టి 2 నుంచి 5 సంవత్సరాల మధ్య చెట్లను నరకవచ్చు. వంటచెరుకు కయితే 2 నుంచి 3 సంవత్సరముల మధ్య నరుక్కోవచ్చు. సుబాబుల్ 6 సంవత్సరములలో 20 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుందట. వర్షాధార ప్రాంతాల్లో సాధారణంగా కలప దిగుబడి ఎకరాకు సంవత్సరానికి 4 నుంచి 8 ఘ.మీ. వస్తుంది. పశుగ్రాసం ఎకరాకు వర్షాధార ప్రాంతాల్లో 5 నుంచి 10 టన్నులు, నీటివసతి ఉన్న ప్రాంతాల్లో 32 నుంచి 36 టన్నుల దిగుబడి వస్తుంది.

అసలు ఎలా నాటుకోవాలి?

మొక్కలను 8 మీటర్ల దూరంలో… రెండు ఉమ్మడి వరుసల్లో నాటుకోవాలి. సుబాబుల్‍ను పచ్చిరొట్టగా ఉపయోగిస్తే ఖరీదైన నత్రజని ఎరువులపై ఆధారపడటం తగ్గించవచ్చు. పచ్చిరొట్టగా ఉపయోగిస్తే ఎకరాకు 8 నుంచి 12 కిలోల నత్రజని లభిస్తుంది. అంతరపంటగా నత్రజని అవసరాన్ని 50 శాతం తగ్గించవచ్చు. కాగితం తయారీకి కావలసిన శ్రేష్ఠమైన గుజ్జు సుబాబుల్ నుండి లభిస్తుంది. సుబాబులు మొక్క ఏపుగా పెరగాలంటే..సైడ్ కొమ్మలను ఎప్పటికప్పుడు నరకాలి..అలాగే..అడ్డులేకుండా చూసుకోవాలి. కొన్ని ప్రదేశాల్లో…కరెంటు తీగలు లాంటివి అడ్డంగా ఉంటాయి..అవి లేకుండా చూసుకుంటే..మొక్కలు ఏపుగా పెరుగుతాయి.

Read more RELATED
Recommended to you

Latest news