కొద్ది నిమిషాల బాక్సింగ్ సీన్ కోసం ఒళ్లు హూనం చేసుకున్న రామ్ చరణ్.. వీడియో వైరల్..

-

మాస్టర్ స్టోరి టెల్లర్ రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాన్ని చూసి ప్రేక్షక లోకం ఫిదా అవుతోంది. పలువురు సినీ ప్రముఖులు ఈ ఫిల్మ్ చూసి సోషల్ మీడియా వేదికగా ‘ఆర్ఆర్ఆర్’ టీంకు కంగ్రాట్స్ చెప్తూ.. రాజమౌళి, హీరోలు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్‌లపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇండియాస్ బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామాను ఇద్దరు సూపర్ హీరోలతో రాజమౌళి అత్యద్భుతంగా తెరకెక్కించాడని అంటున్నారు. ఈ సంగతులు అలా ఉంచితే.. సినిమాలో హీరోల పర్ఫార్మెన్స్ గురించి కూడా సినీ ప్రేక్షకులు, అభిమానులు చర్చించుకుంటున్నారు.

హీరోలిరువురు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ తేజ్ తమ పాత్రకు వంద శాతం న్యాయం చేశారని పేర్కొంటున్నారు సినీ లవర్స్. అయితే, కథ పరంగా రామ్ చరణ్ పాత్రలో వేరియేషన్స్ చాలా ఉన్నాయని, అందుకు తగ్గట్లు చరణ్ పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవల్‌లో ఇచ్చారని మెచ్చుకుంటున్నారు. మెగా పవర్ స్టార్ అభిమానులు అయితే ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పోలీస్ ఆఫీసర్‌గా, అల్లూరి సీతారామ రాజు గెటప్‌లో‌, తారక్‌కు అన్నగా చిత్రంలో చాలా చక్కటి పర్ఫార్మెన్స్ చెర్రీ ఇచ్చాడని కొనియాడుతున్నారు.

ఈ క్రమంలోనే సినిమాలో కొద్ది నిమిషాల పాటు రామ్ చరణ్ కిక్ బాక్సింగ్ చేశాడు. ఆ కొద్ది భాగం కూడా పర్ఫెక్ట్‌గా కనిపించేందుకుగాను రామ్ చరణ్ చాలా కష్టపడి కిక్ బాక్సింగ్ ప్రాక్టీస్ చేశాడని ట్రెయినర్ పేర్కొన్నాడు. రామ్ చరణ్ ట్రెయినింగ్ కు సంబంధించిన వీడియోను బాక్సర్ ప్లస్ రామ్ చరణ్ ట్రెయినర్ అయిన నీరజ్ గోయత్ ట్విట్టర్ వేదికగా షేర్ చేశాడు.

అది చూసి అభిమానులు చరణ్ అన్న గ్రేట్ అని అంటున్నారు. నీ అభిమానులం అయినందుకు గర్వంగా ఉందని పోస్టులు పెడుతున్నారు. నీరజ్ గోయత్ తన ట్వీట్‌లో రామ్ చరణ్ తన చెమట, ఆత్మను పెట్టి మరి కిక్ బాక్సింగ్ ప్రాక్టీస్ చేశాడని, ఆ విషయంలో సినిమాలో స్పష్టంగా కనబడుతుందని పేర్కొన్నాడు. మొత్తంగా రామ్ చరణ్ తండ్రికి తగ్గ తనయుడన్న విషయం మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తున్నాడని రామ్ చరణ్ అభిమానులు వివరిస్తున్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news