మూడు ఎకరాల్లో టమోటా సాగు.. లక్షల్లో నష్టపోయిన రైతు.. అదేలా అంటే..

-

టమోటా ధరలు పెరగడంతో.. ఆ పంట వేసిన రైతులు లక్షలు కాదు కోట్లు సంపాదించేస్తున్నారు. సుడి తిరిగింది, ఏళ్ల నాటి అప్పులన్నీ దెబ్బకి తీరిపోయాయి. ఇంత లాభం వస్తున్న తరుణంలో.. పాపం ఓ టమోటా రైతుకు మాత్రం లక్షల్లో నష్టం వచ్చింది. అదేంటి అలా ఎలా వచ్చిందా అనుకుంటున్నారా..? తినే రాత లేకపోతే.. మనకు ఎంత అదృష్టం ఉన్నా..అది చేతికి అందదూ అంటే ఇదేనమో.. అసలేం జరగిందంటే..

తమిళనాడుకు చెందిన ఓ రైతు మాత్రం తీవ్రంగా నష్టపోయాడు. ఒక్క బాక్స్ టమాటాకు సుమారు రెండు వేల వరకు ఆదాయం వస్తోంది. అలాంటి టైమ్‌లో చేతికొచ్చిన పంట నాశనమైంది. టమాటా సాగు చేసిన రైతుకు కన్నీరు మిగిలింది. నాశనమైన పంటను చూసి బోరును ఏడుస్తున్నాడు. తమిళనాడులో టమాటా సాగు వెండి, బంగారంతో పోటీ పడుతోందనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కానీ ఆ రైతు వేసిన పంటపై అడవిలో ఉండే గజరాజులు, అడవి పందుల కళ్లు పడ్డాయి. అంతే టమాటా కాయలు కాచిన పంటను ధ్వంసం చేశాయి.

తమిళనాడులోని హోసూరు సమీపంలోని డెంకనికోట్ గ్రామానికి చెందిన రవి, చంద్రన్ దంపతులు 3 ఎకరాల్లో సాగు చేసిన టమోటా పంట అడవిలోని జంతువుల పాలైంది. రాత్రిపూట టమాటా తోటలోకి చొరబడిన అడవి పందుల గుంపు పంటను తిని చెట్లను పూర్తిగా ధ్వంసం చేశాయి. తోటలోని టమోటా పంట మొత్తం నాశనం అయింది.

రైతుకు ఏడాదికి సరిపడ ఆదాయం వచ్చే పంటను ఒక్క రాత్రిలో అటవీ జంతువులు ధ్వంసం చేయడంతో రైతు తీవ్రంగా నష్టపోయాడు. మార్కెట్‌లో టమాటాకు మంచి ధర పలుకుతున్న సమయంలో మూడు ఎకరాల పంట కోల్పోవడం చూసి పొరుగున ఉన్న రైతులు కూడా విచారం వ్యక్తం చేస్తున్నారు.

అడవి పందుల కోసం రైతు సోలార్ విద్యుత్ కంచెను వేసినప్పటికి ధ్వంసం చేసి టమాటా పంటను తినేశాయి. టమోటా పంటను ధ్వంసం చేయడంతో లక్షల్లో నష్టం వాటిల్లిందని రైతులు అటవీశాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

మూడ ఎకరాల టమోటా పంట అంటే.. రైతుకు ఈ టైమ్‌లో లక్షల్లో ఆదాయం వచ్చేది. అలాంటిది ఇలా అవ్వడం వల్ల ఆ రైతు పరిస్థితిని చూసి అందరూ జాలి పడతున్నారు. తినే రాత లేకపోతే.. ఇలానే అవుతుంది అని తెలిసిన జనం నిట్టూరుస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news