హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపైకి వరద.. ట్రాఫిక్ జామ్

-

రాష్ట్ర వ్యాప్తంగా ఏకధాటిగా వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వానతో జనజీవనం అస్తవ్యస్తమవుతోంది. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి.  ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలో బుధవారం ఉదయం నుంచి ఏకధాటిగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నగరంలోని చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులు వరదతో చెరువులను తలపిస్తున్నాయి.

తాజాగా హైదరాబాద్‌-విజయవాడ జాతీయరహదారి(NH-65) పైకి వరద నీరు చేరింది. ఎన్టీఆర్‌ జిల్లా నందిగామ నియోజకవర్గం ఐతవరం గ్రామసమీపంలో జాతీయ రహదారిపై వరదనీరు ప్రవహిస్తోంది. వరద ఉద్ధృతి పెరిగితే ఏపీ, తెలంగాణ మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడే ప్రమాదముంది. ఐతవరం వద్ద పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తున్నారు. కంచికచర్ల మండలం కీసర వద్ద మున్నేరు, వైరా ఏరు, కట్టలేరు వరద ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. కీసర వద్ద మున్నేరు, వైరా ఏరు, కట్టలేరు కలుస్తాయి. విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై కీసర వంతెన వద్ద మూడు ఏర్లు కలిసి వరద ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news