“భోళాశంకర్” ట్రైలర్ రిలీజ్.. మెగా అభిమానులకు పండగే..!

-

మెహర్ రమేష్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం భోళాశంకర్. ఈ సినిమాలో చిరంజీవి సరసన మిల్కీ బ్యూటీ తమన్నా కథానాయికగా నటిస్తోంది. ఏకే ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో చిరంజీవి చెల్లెలి పాత్రలో స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ నటిస్తోంది. ఇక యంగ్ హీరో సుశాంత్ ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు.

మాస్ యాక్షన్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాని రూపొందిస్తున్నారు మెహర్ రమేష్. తమిళంలో విజయం సాధించిన వేదాళం చిత్రానికి ఈ సినిమా రీమేక్ అనే విషయం తెలిసిందే. ఈ చిత్రం ఆగస్టు 11న విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ కార్యక్రమాల జోరు పెంచింది మూవీ యూనిట్. తాజాగా భోళాశంకర్ మూవీ ట్రైలర్ ని రిలీజ్ చేసింది మూవీ యూనిట్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ ట్రైలర్ ని రిలీజ్ చేశారు. చిరు పంచ్ డైలాగ్స్, హావాభావాలు, కీర్తి సురేష్ నటనతో ఈ ట్రైలర్ ఆధ్యాంతం ఆకట్టుకునేలా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news