పసుపులో కలుపు నివారణ చర్యలు..తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

-

భారత దేశంలో అధికంగా పండించె పంటలలో ఒకటి పసుపు..ఇది వానిజ్య పంట..దాదాపు అన్నీ ప్రాంతాల్లో ఈ పంటను పండిస్తున్నారు.వరుసల మధ్య ఎడం ఎక్కువగా ఉండుట, దుంపలు ఆలస్యంగా మొలకెత్తుట, సాధారణంగా అధిక సారవంతమైన నెలలో సాగు చేయుట , పైరు ప్రాధమిక పిలక దశలో పెరుగుదలా నెమ్మదిగా ఉండుట, ఎక్కువగా నీటి తడులు పెట్టుట, అధిక మోతదులో సేంద్రియ ఎరువులు, రసాయన ఎరువులు వాడుట, దీర్ఘకాలపు పంట ఆగుట వలన కలుపు ఉధృతి ఎక్కువగా ఉండి పంట నష్టం 50% వరకు కలుగును..గరిక, చిప్పేరా గడ్డి, దోమ కాలు గడ్డి, పుల్లరా గడ్డి, ఊదా,తుంగ , రాకసి తుంగ గలీజేరు, గురుగు, వయ్యారి భామ, పాయలకు, కామంచి ఆకు ఎక్కువగా పెరుగుతుంటాయి..

కలుపు యాజమాన్యం..

పసుపు కొమ్ము నాటిన వెంటనే లేదా 2,3 రోజులలో ఎకరాకు పెండిమీథాలీన్30% ద్రావకం ఎకరాకు 1.3 నుండి 1.6 లి. లేదా అల్లాక్లోర్ 50% ద్రావకం 1.5 – 2.0 లీటర్ చొప్పున ఏదో ఒక దానిని పిచికారీ చేయాలి. రైతులు రసాయన మందులు వాడకపోతే , పసుపు 7-10 రోజులలో కలుపు విపరీతంగా వస్తుంది. పసుపు అప్పటికి మొలకేత్తదు. అప్పుడు కలుపు నిర్మూలించుటకు, పేరక్వాట్ 24% ద్రావకం 1.0 లి. ఎకరాకు కలిపి పిచికారీ చేయాలి.విత్తిన నేల రోజుల తర్వాత నుంచి 15-20 రోజుల వ్యవధిలో అవసరాన్ని బట్టి 3,4 సార్లు అంతర కృషి చేయాలి. అవసరమైతే మొక్కల మధ్య మనుషులతో కలుపు తీయించాలి.

గడ్డి జాతి మొక్కలు ఎక్కువగా ఉంటే వాటి నిర్ములనకు ఎకరాకు 400 మీ. లి. ఫెనక్సప్రాప్ 5% ద్రావకం 200 లి. నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ధనియాలు విత్తనం కొరకు ధనియాలు విత్తనం కొరకు సాధారణంగా శీతాకాలపు పంటగా పండిస్తారు. ధనియాలు. మొలకత్తుటకు 8-12 రోజులు పడుతుంది. పైరు ప్రాధమిక దశలో పెరుగుదల నెమ్మదిగా ఉంటుంది. కనుక పైరు కలుపు నుండి పోటీని ఏమాత్రం తట్టుకోలేదు.

కలుపు నిర్ములనకు విత్తిన వెంటనే లేదా రెండు మూడు రోజులలో ఎకరాకు పెండిమీథాలీన్ 30% ద్రావకం ఎకరాకు 1.0 నుండి 1.3 లి. లేదా అల్లాక్లోర్ 50% ద్రావకం 1.5 – 2.0 లి చొప్పున ఏదో ఒక దానిని 200 లీ. నీటిలో కలిపి పిచికారీ చేయాలి.విత్తిన 20-25 రోజులప్పుడు గొర్రు గుంటకతో అంతర కృషి చేయాలి.గడ్డి జాతి మొక్కలు ఎక్కువగా ఉన్నప్పుడు ఎకరాకు 250 మీ. లీ ఫెనక్సప్రాప్ ఇధైల్ 9% ద్రావకం 400 మీ. లీ. చొప్పున పిచికారీ చేయాలి..ఇలా చెయ్యడం వల్ల కలుపు మొక్కలు పోయి,పంట బాగా ఊరుథుంది..అధిక లాభాలను కూడా పొందవచ్చు..

 

Read more RELATED
Recommended to you

Latest news