వ్యవసాయంలో మనం ఎంత ప్రగతి సాధించినా… మనం వాడే రసాయనాలు, ఎరువుల వల్ల పంటలు కలుషితంగా మారుతున్నాయి. దిగుబడి రావాలని రైతులు విపరీతంగా రసాయన మందులను వాడుతున్నారు. దీంతో దిగుబడి కన్నా పెట్టుబడి పెరుగుతోంది.
అయితే రసాయన మందులతో వ్యవసాయం చేసే కన్నా… ఆర్గానిక్ వ్యవసాయం చేసేందుకు ప్రజలు ముందుకు వస్తున్నారు. వీటినే సేంద్రీయ వ్యవసాయం, రసాయన రహిత వ్యవసాయంగా చెబుతుంటారు. సేంద్రీయ వ్యవసాయంలో ప్రకృతి నుంచి లభించే పదార్థాల నుంచే మనం పంటలకు మందులు తయారు చేసుకుంటాం.
ఆర్గానికి ఫార్మింగ్ కి ఇవే కీలకం:
ఆర్గానిక్ ఫార్మింగ్ లో కీలకం అయ్యేది ఆవుపేడ, మూత్రం వీటితో పాటు బెల్లం, శెనిగ పిండి వేపపిండి ఇలా మనకు నిత్యం లభించే పదార్థాలతో ఎరువులను తయారు చేసుకోవచ్చు. మనకు రసాయనికంగా డీఏపీ, యూరియాలు నేలకు అందించే పాస్ఫరస్, నైట్రోజన్ వంటి వాటిని ఈ ఆవు పేడ, మూత్రం ఇతర పదార్థాలు సహజంగా అందిస్తాయి. వీటితో వ్యవసాయం చేయడం వల్ల నేలలో సహజంగా ఖనిజలవణాలు పెరగడంతో పాటు.. నేలతో పంటల ఎదుగుదలకు ముఖ్యమైన వానపాములు, సూక్ష్మజీవులు పెరిగేందుకు దోహదపడుతాయి. తర్వాత పంటల ఎదుగుదల బాగుంటుంది.
సేంద్రీయ వ్యవసాయంతో లాభాలు:
1960ల్లో గ్రీన్ రెవల్యూషన్ ప్రారంభం అయిన తర్వాత నుంచి ఇండియాలో పంటల ఉత్పాదకత పెరిగింది. హై ఈల్డింగ్ వెరైటీ వంగడాలు, ఫెర్టిలైజర్స్, ఫెస్టిసైట్స్ వాడకం చాలా ఎక్కువైంది. మొదట్లో భాగానే ఉన్నా.. తరువాత ఎరువుల రేట్లు పెరగడం.. దీనికి అనుగుణంగా పంటల మద్దతు రేటు, గిట్టుబాటు రేటు దక్కకపోవడంతో రైతులకు పెట్టుబడి ఎక్కువైంది. దీనికి తోడు పంటలకు విపరీతంగా రసాయనాలు వాడటం, కలుపు మందులను వాడటంతో ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది.
ఈ ఖర్చులన్నింటిని తగ్గించుకుని… ఆరోగ్యవంతమైన వ్యవసాయంగా మారేందుకు సేంద్రీయ వ్యవసాయం ఉపయోగపడుతుంది. మనం నిత్య జీవితంలో ఉపయోగించే పదార్థాలతో ఎరువులను తయారు చేసుకోవడం వల్ల ఖర్చు లేకుండానే పంటలకు సహజంగా ఎరువులను అందించే వాళ్ల అవుతాం. ఈ పద్దతిలో వ్యవసాయం చేయడం వల్ల పంటలపై రసాయనాల దుష్ఫ్రభావం ఉండదు. రైతులు పెట్టుబడి వ్యయం చాలా వరకు తగ్గుతుంది. లాభాలను ఆర్జించే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
ముందుకొస్తున్న రైతులు:
సేంద్రీయ వ్యవసాయం వల్ల ఇన్ని లాభాలు ఉండటంతో ఇప్పుడిప్పుడే రైతులు సేంద్రీయ వ్యవసాయానికి అలవాటు పడుతున్నారు. కొత్త మంది ఔత్సాహిక రైతులు ఆర్గానిక్ వ్యవసాయానికి మొగ్గు చూపుతున్నారు. అయితే రసాయన వ్యవసాయం నుంచి రైతులు పూర్తిగా ఆర్గానిక్ వైపు మళ్లడం అంత తేలికైన విషయం కాదు. అయితే దీనిపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. సేంద్రీయ వ్యవసాయం వల్ల రసాయనిక వ్యవసాయంలో వచ్చే దిగుబడి రాకపోవచ్చు. మొదట్లో ఆర్గానిక్ వ్యవసాయం వల్ల పెట్టుబడి, దిగుబడి తక్కువగానే ఉంటాయి. క్రమంగా రెండు మూడు ఏళ్లు ఆర్గానిక్ వ్యవసాయం చేస్తూ ఉంటే… రసాయన వ్యవసాయానికి ధీటుగా దిగుబడి సాధించే అవకాశం ఉంటుంది.