బొప్పాయి సాగులో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

-

తెలుగు రాష్ట్రాల్లో ఈ మధ్య బొప్పాయి పంటను ఎక్కువగా వేస్తున్నారు.సరైన యాజమాన్య పద్ధతులు పాటించడం ద్వారా బొప్పాయి సాగులో మంచి దిగుబడులు పొంది లాభాలు సొంతం చేసుకోవచ్చు. 9 నెలల నుంచి రెండేండ్ల వరకు కాపునిచ్చే ఈ పంట సాగు లాభసాటిగా ఉంటుంది. సాగు సమయంలో వైరస్, బ్యాక్టీరియా తెగుళ్ళ ఉద్ధృతి ఎక్కువగా ఉంటుంది.ఎప్పటికప్పుడు సరైన పద్ధతులు తీసుకోవడం వల్ల మంచి దిగుబడిని పొందవచ్చు..

 

తెగుళ్లు :

కాండం తెగుళ్లు :వానాకాలంలో ఈ తెగులు అధికంగా ఉంటుంది. నీరు ఎక్కువగా నిలువ ఉండటం వల్ల కాండం కుళ్ళిపోతుంది. చివరకు చెట్టు చనిపోతుంది. దీని నివారణకు మొక్క మొదలు వద్ద నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి. కాపర్ ఆక్సీక్లోరైడ్ అనే మందును లీటరు నీటికి 3 గ్రాముల చొప్పున కలిపి బొప్పాయి మొక్కల మొదళ్లలో పోయాలి..

కాయలు కోతకు వచ్చే సమయానికి ఈగల బెడద ఎక్కువగా ఉంటుంది.తీవ్రనష్టాన్ని కలుగజేస్తాయి. వీటి నివారణకు మిథైల్ యుజినల్ ఎర బుట్టలను ఉపయోగించి ఈగలను ఆకర్షించేలా చేయాలి. ఈ బుట్టల్లో చిక్కిన ఈగలను నాశనం చేయాలి. తోటను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవడం ద్వారా ఈగల సమస్య రాకుండా చూసుకోవచ్చు.రసం పీల్చే పురుగులు, పేను బంక , తెల్లదోమ , మొజాయిక్, రింగ్ స్పాత్ వంటి వైరస్ తెగుళ్ళు కారణంగా బొప్పాయి పంట దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. ఇవి ఆశించడంతో పంట నాణ్యతతోపాటు దిగుబడి కూడా తగ్గిపోతుంది. ప్రొఫెనోపాస్ లీటరు నీటికి 2 మిల్లీలీటర్లు కలిపి పిచికారి చేసుకోవాలి. రెండో దశలో ఇమిడా క్లోప్రేడ్ 0.3 మిల్లీలీటర్లు లీటరుకు కలిపి పిచికారి చేయాలి.. అప్పుడే వీటి తీవ్రత తగ్గుతుంది..

పిండినల్లి తెగులు నివారణకు 2 మిల్లీలీటర్ల ప్రొఫినోఫాస్.. లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి. ఇక నులి పురుగుల నివారణకు 250 గ్రాముల వేప పిండి, కర్బోఫ్యురాన్ 3జీ గుళికలు, సుదోమొనాస్ ఫొరిసెన్స్ 4గ్రాముల చొపున ఒక్కో మొక్కకు వేయాలి.అంతేకాదు పసుపు రంగు జిగురు అట్టాలను కూడా పెట్టడం మంచిది.. బొప్పాయి సాగులో ఇంకేదైనా సందేహాలు ఉంటే వ్యవసాయ నిపుణుల సలహా తీసుకోవడం మంచిది..

Read more RELATED
Recommended to you

Latest news