చెరుకు సాగులో అధిక దిగుబడులు రావాలంటే ఈ జాగ్రత్తలు తీసుకోవాలి..!

-

చాలా మంది రైతులు చెరుకు సాగుని చేస్తూ ఉంటారు. మన రాష్ట్రంలో చూసుకున్నట్లయితే సుమారు లక్షన్నర హెక్టార్లలో చెరకు పంటను సాగు చేస్తూ మంచిగా దిగుబడిని పొందుతున్నారు రైతులు. చెరుకు పంటకి నీళ్లు నిలవకుండా ఉండే ఇసుక నేలలు బాగా అనుకూలంగా ఉంటాయి. జనవరి, మార్చి నెలల్లో చెరుకు పంట నాటుకోవచ్చు.

ఒకవేళ కనుక నాటడం ఆలస్యమైతే కొన్ని అనువైన రకాలను మీరు ఎంచుకుని మార్చి, మే నెలలో నాటవచ్చు. అయితే చెరకు సాగు లో మంచిగా రాబడి రావాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం.

చెరకు విత్తన ఎంపికలో మీరు మొదట పూత పూయని చెరుకుల చిగురు భాగంగాని లేదా 7 నుంచి 8 నెలల వయస్సుగల లేవడి తోటల చెరుకును మూడు కళ్ళ ముచ్చెలుగా కొట్టి దానిని మాత్రమే విత్తనంగా వాడాలి. అదే మంచిది. రైతులు ఇలా అనుసరిస్తే సమస్యలేమీ వుండవు. ఎకరానికి 16,000 మూడు కళ్ళ ముచ్చెలను వాడాలి.

మూడు కళ్ళ ముచ్చెలను 300 లీటర్ల నీటికి 150 గ్రా.ల కార్బెండిజిమ్ మరియు 600 మి.లీ. మలాథియాన్ కలిపిన ద్రావణంలో 15 నిమిషాలు ఉంచాక అప్పుడు మీరు మీ పొలం లో నాటాలి. పొలుసు పురుగు, అనాసకుళ్ళు తెగులును రాకుండా చూసుకోవాలి. ఇలా ఈ విధంగా అనుసరిస్తే ఏ సమస్యా ఉండదు. కాటుక తెగులు,గడ్డిదుబ్బు తెగులు, ఆకుమాడు తెగుళ్ళను రాకుండా చూసుకోవాలి. ఇలా తగిన జాగ్రత్తలని తీసుకుంటే పంటకి నష్టం ఉండదు.

Read more RELATED
Recommended to you

Latest news