organic farming: సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేస్తే లాభాలెన్నో…అందుకే ఆరేళ్ళ నుండి ఇదే బాట పట్టిన రైతు..!

-

కెమికల్స్ వాడడం వల్ల పర్యావరణం దెబ్బతింటుంది. కానీ చాలా మంది రైతులు కెమికల్స్ ని వాడితే త్వరగా పంట చేతికి వస్తుందని, మంచిగా డబ్బులు పొందొచ్చని కెమికల్స్ ని వాడి పంటలు పండిస్తూ ఉంటారు. అయితే కెమికల్స్ వాడడం వల్ల పర్యావరణము తో పాటు ఆరోగ్యం కూడా పాడవుతుంది.

అందుకని రైతులు పంటలు పండించేటప్పుడు కెమికల్స్ వాడకుండా సేంద్రియ వ్యవసాయం చేసే పడితే మంచిది. సేంద్రీయ వ్యవసాయం చేయడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది. అలానే సేంద్రియ వ్యవసాయం చేయడం వల్ల పర్యావరణానికి కూడా ఎలాంటి ముప్పు కలుగదు. అయితే సేంద్రియ వ్యవసాయం చేస్తున్న ఒక రైతు గురించి, తన పంట గురించి తెలుసుకుందాం.

ఈ రైతు కల్తీ లేని ఆహారాన్ని అందించాలని.. సేంద్రియ వ్యవసాయమే చేస్తున్నాడు. నిన్న మొన్నటి నుండి కాదు ఏకంగా ఆరు సంవత్సరాల నుండి కూడా ఆర్గానిక్ ఫార్మింగ్ ఏ చేస్తున్నాడు ఈ రైతు. ఈ రైతు పేరు సూర్య నారాయణ. కర్నూలు జిల్లా హుసేనాపురం లో ఉంటారు. అయితే ఈయన కూడా మొదట్లో అందరిలాగే కెమికల్స్ తో పంటలు పండించేవారు.

అయితే అలా పండించడం వల్ల భూమిలో సారం పోతుంది. పైగా ఖర్చు కూడా ఎక్కువ అవుతుంది. ఆశించిన దిగుబడి కూడా పొందడం లేదు. నిజానికి లాభం కంటే నష్టమే ఎక్కువ వస్తుంది. అందుకే మరో పద్ధతిని ఎంచుకోవాలని అనుకున్నారు. అప్పటి నుండి ఆర్గానిక్ ఫార్మింగ్ ఏ చేస్తున్నాడు. మొత్తం ఆరు ఎకరాల్లో ఆర్గానిక్ ఫార్మింగ్ ని చేస్తున్నారు. పైగా సొంతంగా ఎరువుల్ని తానే తయారు చేసుకుంటున్నారు.

మట్టి, ఆవు పేడ, బెల్లం, పిండి గోపంచకం, పుట్ట మట్టి తో ఎరువులను తయారు చేసి వ్యవసాయం చేస్తున్నారు. ఈ మిశ్రమాన్ని స్వయంగా తానే తయారు చేసుకుని పంటల కోసం ఉపయోగిస్తున్నారు. ఇలా పండించడం వల్ల ప్రజలకు నాణ్యమైన ఆహారాన్ని అందిస్తున్నారు. పైగా తక్కువ ఖర్చుతో నేలను దున్నడానికి పరికరాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఈ రైతు కి ఏం పండిస్తున్నాను అనే దాని కంటే కూడా ఎంత మంచిగా పని చేస్తున్నాం అనేది ముఖ్యం.

ప్రతి రైతు కూడా ఇలానే ఆలోచించాలని ఆయన చెబుతున్నారు. పని ఎక్కువ ఉన్నప్పటికీ ఖర్చు బాగా తక్కువగా ఉంటుందని స్వయంగా ఆయన చెబుతున్నారు. వరి పండించినా కూరగాయలు పండించినా చాలా మంది కెమికల్స్ ని వాడుతున్నారని…

కెమికల్స్ వల్ల భూమిలో సారం తగ్గిపోతోందని ఆయన అంటున్నారు. అయితే ఇలా ఆర్గానిక్ ఫార్మింగ్ చేయడం వల్ల భూమిలో సారం పెరుగుతుందని.. రానురాను దిగుబడులు పెరుగుతాయి అని చెప్పారు. ఆరోగ్యం కూడా బాగుంటుంది అని అన్నారు. అందుకనే ప్రతి ఒక్క రైతు కూడా ప్రకృతి వ్యవసాయం చేస్తే మంచిదని అన్నారు. కనుక ఆర్గానిక్ ఫార్మింగ్ చేసి అన్ని విధాలుగా లాభాలను పొందొచ్చు. ముఖ్యంగా ఆరోగ్యపరంగా ఆర్గానిక్ బెస్ట్.

Read more RELATED
Recommended to you

Exit mobile version