మీ పెదవులు పగిలి మంట వస్తోందా..? సులువుగా ఇలా చెక్ పెట్టండి మరి..!

-

చలికాలంలో పెదాలు పగిలి పోతున్నాయి. పెదవులు పగిలి పోతే రక్తం రావడం లేదంటే నొప్పి కలగడం వంటివి జరుగుతుంటాయి. చలికాలంలో పెదాలు ఎక్కువగా పగిలి పోతు ఉంటాయి అటువంటప్పుడు చాలా సమస్యగా ఉంటుంది. పెదవులు చాలా సున్నితంగా ఉంటాయి కాబట్టి త్వరగా పగిలిపోతాయి కూడా. అందం దెబ్బతినడం మాట పక్కన పెడితే మంట పుడుతూ ఉంటాయి.

 

దీని వలన ఎంతో ఇబ్బందిగా ఉంటుంది. మీరు కూడా తరచూ ఈ సమస్యతో బాధపడుతూ ఉంటున్నారా..? అయితే కచ్చితంగా ఈ చిట్కాలను చూడాలి. మార్కెట్లో దొరికే ప్రొడక్ట్స్ లో కెమికల్స్ ఉంటాయి అలా కాకుండా ఇంట్లో మనం ఈ ప్రొడక్ట్స్ ను ఉపయోగిస్తే ఖచ్చితంగా సమస్యకు చెక్ పెట్టడానికి అవుతుంది. మరి అది ఎలానో ఇప్పుడు చూద్దాం. తేనే చక్కగా ఈ సమస్య నుండి పరిష్కారం చూపుతుంది.

తేనె బాదం:

సులభంగా మనం ఈ స్క్రబ్ ని చెయ్యచ్చు. దీని కోసం మీరు చక్కెరను 2 స్పూన్లు, తేనె 1 స్పూన్, బాదం నూనె ని 1 స్పూన్ తీసుకోవాలి. వీటిని బాగా మిక్స్ చేసి పెదాలకు అప్లై చేస్తూ వుండండి. ఇలా చేస్తే ఈ సమస్య నుండి పరిష్కారం చూపుతుంది. డబ్బాలో పెడితే నిల్వ ఉంటుంది కూడా.

తేనె కొబ్బరి:

సులభంగా మనం ఈ స్క్రబ్ ని కూడా చెయ్యచ్చు. కొబ్బరి నూనె, ఆలివ్ ఆయిల్, తేనెను అన్నింటినీ కలిపి స్క్రబ్ చెయ్యచ్చు. దీనిని కూడా స్టోరేజ్ చేస్తే నిల్వ ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news