స్నానం చేసే నీటిలో దీనిని కలిపితే.. బోలెడు లాభాలు..!

-

ప్రతిరోజు రెండు పూట్లా స్నానం చేస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఒత్తిడి, ఆందోళన తగ్గిపోతుంది. చక్కగా నిద్ర కూడా పడుతుంది. అయితే స్నానం చేసే నీటిలో దీనిని కలుపుకుని చేయడం వలన చాలా ప్రయోజనాలని పొందవచ్చు. స్నానం చేసేటప్పుడు ఆ నీళ్లల్లో కొంచెం పటికను కలిపి స్నానం చేస్తే చాలా మంచిది. అనేక రకాల చర్మవ్యాధులు తగ్గిపోతాయి. చర్మం కాంతివంతంగా మెరుస్తుంది. యవ్వనంగా ఉంటారు. వృద్ధాప్య ఛాయలు కూడా తగ్గిపోతాయి. ముఖంపై ఉండే ముడతలు, మచ్చలు కూడా పటిక వలన పోతాయి.

పటికను నీళ్ళల్లో కలిపి ఆ నీటితో స్నానం చేస్తే ఎలాంటి నొప్పులు అయినా కూడా మాయమైపోతాయి. చాలామంది కండరాలు, కీళ్లు, మోకాళ్ళ నొప్పులతో బాధపడుతూ ఉంటారు. ఒళ్ళు నొప్పుల నుంచి కూడా ఉపశమనం పొందాలని చూస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు స్నానం చేసే నీటిలో కొంచెం పటికను కలిపి స్నానం చేయడం మంచిది స్నానం చేసినా కూడా శరీరం దుర్వాసన వస్తూ ఉన్నట్లయితే ఈ నీళ్లతో స్నానం చేయడం మంచిది.

కాలిన గాయాలు, ఇతర గాయాలు, పుండ్లు కూడా మాయమైపోతాయి. పటిక వేసిన షాంపూతో తల స్నానం చేస్తే శిరోజాలు ఆరోగ్యంగా మారతాయి, ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేక లాభాలను పొందవచ్చు. చర్మం మృదుగా మారాలన్నా కూడా పటికను నీళ్ళల్లో కలిపి స్నానం చేయడం మంచిది. చర్మం మృదువుగా మారడమే కాకుండా యవ్వనంగా అందంగా కనపడతారు. రోజంతా అలసిపోయి ఒత్తిడితో సతమతమైనట్లయితే రాత్రి ప్రశాంతంగా నిద్ర పట్టడానికి పటిక కలిపిన నీళ్లతో స్నానం చేయడం మంచిది, హాయిగా నిద్రపోవచ్చు. నిద్రలేమి వంటి బాధలు కూడా ఉండవు ఆందోళన కూడా తగ్గుతుంది ఎంతో రిలీఫ్ గా ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news