Beauty Tips : కాఫీతో ఇలాంటి ఫేస్‌ ప్యాక్‌లు ట్రై చేయండి.. ముడతలు ఉండవు

-

Beauty Tips : కాఫీ ఆరోగ్యానికి మంచిది కాదేమో కానీ.. అందానికి మాత్రం చాలా మంచిది. కాఫీ పౌడర్‌తో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే కాఫీ, చర్మం వృద్ధాప్యం, నల్ల మచ్చలు, ముడతలు మొదలైన వాటిని నివారించి, ముఖం యవ్వనంగా కనిపించేలా చేస్తుంది. ఇందుకోసం కాఫీ పౌడర్‌తో కూడిన ఫేస్ ప్యాక్‌లు సహాయపడతాయి. ఈరోజు కాఫీ పౌడర్‌తో ఎలాంటి ఫేస్‌ ప్యాక్‌లు వేసుకోవచ్చో తెలుసుకుందాం.

Beauty Tips With Coffee Powder

1. కాఫీ- ఆలివ్ నూనె

రెండు టీస్పూన్ల కాఫీ పౌడర్‌కి రెండు టీస్పూన్ల ఆలివ్ ఆయిల్ కలిపి ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తర్వాత కడిగేయాలి. ఈ ప్యాక్ బ్లాక్ హెడ్స్‌ను తొలగించి చర్మం కాంతివంతంగా మార్చడంలో సహాయపడుతుంది.

2. కాఫీ- తేనె

రెండు టీస్పూన్ల కాఫీ పౌడర్‌కి రెండు టీస్పూన్ల తేనె కలిపి ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తర్వాత కడిగేయాలి. ఈ ప్యాక్ ముఖంపై ముడతలు రాకుండా చేస్తుంది.

3. కాఫీ- పసుపు

ఒక టీస్పూన్ కాఫీ పౌడర్‌లో చిటికెడు పసుపు మరియు ఒక టీస్పూన్ పెరుగు వేసి కలపాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని మీ ముఖానికి పట్టించాలి. 20 నిమిషాల తర్వాత కడిగేయాలి. ఈ ప్యాక్ మచ్చలను తొలగించి ముఖం కాంతివంతంగా మార్చేందుకు సహాయపడుతుంది.

4. కాఫీ పొడి- నీరు

కళ్ల కింద నల్లటి వలయాలను పోగొట్టాలంటే కాఫీ పొడిని నీటితో కలిపి పేస్ట్ లా చేసి కళ్ల కింద అప్లై చేయాలి. 20 నిమిషాల తర్వాత కడిగేయాలి.

కాఫీ పౌడర్‌తో ఇలాంటి ఫేస్‌ ప్యాక్‌లు వేసుకుంటే మఖానికి మంచి ప్రయోజనాలు అందుతాయి. వారానికి ఒకసారి ఇలాంటి ఫేస్‌ ప్యాక్‌లు వేసుకుంటే ముఖంపై ట్యాన్‌, నల్ల మచ్చలు అన్నీ పోతాయి. టమోటా కాఫీ పౌడర్‌ కలిపి ఫేస్‌పై మర్దనా చేసుకున్నా చాలు.

గమనిక

అలెర్జీ సంబంధిత సమస్యలు లేవని నిర్ధారించుకోవడానికి ప్యాక్‌లు మరియు స్క్రబ్‌లను ఉపయోగించే ముందు ప్యాచ్ టెస్ట్ చేయండి. అదేవిధంగా వైద్యులను సంప్రదించిన తర్వాతే ముఖంపై ప్రయోగాలు చేయడం ఉత్తమం.

Read more RELATED
Recommended to you

Exit mobile version