రైతు భరోసాపై మంత్రి భట్టి విక్రమార్క కీలక ప్రకటన!

-

రైతు భరోసా పై తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకోబోతుంది. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల అభిప్రాయాలను సేకరించిన తరువాత శాసన సభ్యులతో చర్చించి.. వారి సమ్మతి మేరకు రైతు భరోసా పై నిర్ణయం తీసుకుంటామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. ఈ మేరకు రాష్ట్రంలో ప్రజా పాలన కొనసాగుతుందని తెలిపారు.

ముఖ్యంగా ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల్లో తప్పులుంటే.. వేలెత్తి చూపాలన్నారు. లోపాలు ఉంటే.. తప్పకుండా సరి చేసుకుంటామన్నారు. బడ్జెట్ లో రైతాంగానికి ప్రాధాన్యత ఇచ్చామని చెప్పారు భట్టి. రైతు రుణమాణీ కొనసాగిస్తామన్నారు. విద్యా రంగానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి వద్దనే విద్యాశాఖ ఉందని తెలిపారు. మరోవైపు చేనేత పరిశ్రమను ఆదుకుంటాం. బతుకమ్మ చీరలతోనే కాకుండా హాస్టల్ విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ తదితర వాటికి కూడా ఉపయోగించుకుంటామని తెలిపారు. రాష్ట్రంలో నెలకొన్న ధరణీ పోర్టల్ సమస్యలను పరిష్కరించేందుకు మంత్రి వర్గ ఉప సంఘం కృషి చేస్తోందని వెల్లడించారు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version