కళ్ళు, కనుబొమ్మలు అందంగా ఉంటే ముఖానికి అందమే వేరు. అయితే చాలా మందికి కనుబొమ్మలు లైట్ గా ఉంటాయి. అయితే కొంచెం పెద్దగా ఉంటే చూడడానికి బాగుంటుంది. అలానే అందం కూడా పెరుగుతుంది.
మీకు కూడా కనుబొమ్మలు లైట్ గా ఉన్నాయా..? వాటిని మీరు డార్క్ గా చేసుకోవాలని అనుకుంటున్నారా..? అయితే ఈ టిప్స్ ని ఫాలో అవ్వండి. వీటిని కనుక ఫాలో అయ్యారంటే ఖచ్చితంగా మీ కనుబొమ్మలు మంచి ఆకృతిలో ఉంటాయి. అలానే ఒత్తుగా ఉంటాయి. మరి ఇక ఆలస్యం ఎందుకు వాటికోసం ఇప్పుడే చూద్దాం.
ఆలివ్ ఆయిల్:
కనుబొమ్మల మీద ఆలివ్ ఆయిల్ ను అప్లై చేయడం వల్ల జుట్టు గ్రోత్ పెరుగుతుంది. ఆలివ్ ఆయిల్ లో విటమిన్ సి ఉంటుంది. కొన్ని చుక్కలు ఆలివ్ ఆయిల్ ను తేనెలో మిక్స్ చేసి రాయండి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేసుకోండి.
పాలు:
పాలు కూడా కనుబొమ్మల మీద జుట్టుని పెంచుతాయి. పాలల్లో దూదిని ముంచి దానిని కనుబొమ్మల మీద రాయండి. దానిని పూర్తిగా ఆరనిచ్చి ఆ తర్వాత కడిగేసుకోండి.
కొబ్బరి నూనె:
కొబ్బరి నూనె తో కనుబొమ్మల మీద మసాజ్ చేయడం వల్ల కూడా కనుబొమ్మల మీద జుట్టు పెరుగుతుంది. నేచురల్ మాయిశ్చరైజర్ గా కూడా ఇది పనిచేస్తుంది.
ఆముదం:
ఆముదం లో దూదిని ముంచి కనుబొమ్మల మీద రాయండి. రాత్రి రాసి ఉదయం వరకు వదిలేసి ఉదయాన్నే కడిగేసుకుని ఇలా చేయడం వల్ల మంచిగా కనుబొమ్మలు పెరుగుతాయి. ఇలా ఈ చిట్కాలను మీరు ఫాలో అవ్వడం వల్ల అందమైన కనుబొమ్మలను పొందొచ్చు.