హైడ్రాఫేషియల్‌ వల్ల నిజంగా ముఖం తెల్లగా అవుతుందా..? మచ్చలు, మొటిమలు పోతాయా..?

-

ఈ మధ్య సెలబ్రెటీలు, సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు హైడ్రాఫేషియల్‌ తెగ చేయించుకుంటున్నారు. ముఖానికి ఏదేదో పూస్తారు, మిషన్స్‌తో మసాజ్‌.. చివర్లో కళ్లతో సహా మొత్తం మొఖం మీద పెయింట్‌ వేసినట్లు వేసి ముఖంపై బ్లూలైట్స్‌, రెడ్‌ లైట్స్‌ వచ్చే క్యాప్‌ మాస్క్‌ లాంటిది ఏదో పెడతారు.. ఇదంతా చేసిన తర్వాత ఫేస్‌ చాలా క్లియర్‌గా, బ్రైట్‌గా ఉంటుంది. మీరూ ఇలాంటి వీడియోలను చూసే ఉంటారు. దీని కాస్ట్‌ కాస్త ఎక్కువైన రిజల్ట్‌ మాత్రం మీకు నచ్చుతుంది.  ఈరోజు మనం ఈ హైడ్రాఫేషియల్‌ గురించి మొత్తం వివరాలు తెలుసుకుందాం.. దీన్ని చేయించుకోవడం స్కిన్‌కు సురక్షితమేనా, సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉంటాయా అని.!
ప్రతి చర్మానికి ఏదో ఒక సమస్య ఉంటుంది. హైడ్రాఫేషియల్‌లో ఎలాంటి ఫేస్‌ సమస్యకు అయినా పరిష్కారం ఉంటుంది. అయితే సౌందర్య నిపుణుల సలహా లేకుండా ఈ ట్రీట్మెంట్‌ తీసుకోకూడదు. ఫేస్‌ మీద ఎప్పుడు మొటిమలు, ముడతలు ఉండే వాళ్లకు ఈ ఫేషియల్‌ చాలా బాగా ఉపయోగపడుతుంది.
హైడ్రాఫేషియల్‌ అంటే ఒక్క ముక్కలో చెప్పాలంటే.. ముఖంపై బ్లడ్‌ సర్కూలేషన్‌ను స్లోగా పెంచడమే.. వాళ్లు వాడే మెషిన్స్‌తో ముఖంపై బ్లడ్‌ సర్కులేషన్‌ పెంచుతాయి. ఎప్పుడైనా సరే.. ముఖంపై బ్లడ్‌ బాగా సర్కులేషన్‌ జరిగితే.. ఫేస్‌ ఆటోమెటిక్‌గా గ్లో అవుతుంది. ఈ పింపుల్స్‌, ముడతలు కూడా పోతాయి. అయితే ఈ ఫేషియల్‌లో ముఖం మీద ఉన్న వ్యర్థాలను, ఆయిల్‌ను కూడా తీసేస్తారు. ఫస్ట్‌ సిట్టింగ్‌లోనే మీరు రిజల్ట్ చూస్తారు. మీ ఫేస్‌ బాగా నల్లగా, ఎక్కువ ముడతలు, మొటిమలు, కళ్ల కింద డార్క్‌ సర్కిల్స్‌ ఉంటే రెండు మూడు సిట్టింగ్‌లకు మొత్తం తగ్గిపోతుంది. ముఖం మీద ఎలాంటి మచ్చలు ఉన్నా తగ్గిపోతాయి. ఇందులో వాడే సిరమ్‌లు, క్రీములు, ఆ లైట్స్‌ అన్నీ చర్మానికి కొత్త జీవంపోస్తాయి.
అయితే ఈ ఫలితాలు శాశ్వతంగా ఉంటాయా అంటే చెప్పలేం.. అది మీ లైఫ్‌స్టైల్‌ను బట్టి మీరు ఉండే ప్రదేశాన్ని బట్టి ఉంటుంది. మీరు ఎండకు ఎక్కువ తిరగకుండా ఏసీలో ఉండే వాళ్లు అయితే ఈ రిజల్ట్‌ ఎక్కువ కాలం ఉంటుంది. అదే మీ జాబ్‌ ఔట్‌డోర్‌ ఉంటే.. రోజంతా ఎండలోనే తిరగాల్సి వస్తే.. త్వరగా మెరుపు తగ్గుతుంది. అయితే మచ్చలు, మొటిమలు మళ్లీ రావు.. మునుపు ఉన్నంత గ్లో అయితే ఉండదు. ఈ ఫేషియల్‌ కాస్ట్‌ హైదరాబాద్‌, విజయవాడ లాంటి నగరాల్లో అయితే 2000-6000 వరకూ కూడా ఉంది. చిన్న చిన్న పార్లర్లో ఈ ఫేషియల్‌ చేయకపోవచ్చు. స్పెషల్‌ అకేషన్స్‌ ఉన్నా, లేక ముఖం బాగా నల్లగా ఉండి ఏ క్రీమ్స్‌ వాడినా మీరు ఆశించినంత ఫలితం లేకపోయినా, ఫేస్‌ మీద టాన్‌ ఎక్కువగా ఉన్నా.. ఒకసారి ఇది ట్రే చేయొచ్చు. అయితే కచ్చితంగా సౌందర్య నిపుణుల సలహా లేకుండా మీరు స్టెప్‌ తీసుకోకండి. ఈ ఫేషియల్‌ అందుబాటులో ఉన్న పార్లర్లతో స్కిన్‌ స్పెషలిస్టులు ఉంటారు.  కాబట్టి సమస్య ఉండదు. అయితే సమస్య ఏంటంటే.. ఈ ఫలితం అందరికీ ఒకేలా ఉంటుంది అన్న గ్యారెంటీ లేదు. మీ స్కిన్‌ టైప్‌, మీకు ముందు నుంచే ఏమైనా స్కిన్‌ సమస్యలు ఉన్నా ఈ ఫేషియల్‌ ఫలితాలు మారవచ్చు. మీది మరీ సెన్సిటివ్‌ స్కిన్‌ అయితే సమస్య ఇంకా కాస్త ఎక్కువే ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version