వృద్ధాప్య ఛాయలను తగ్గించే అవిసె గింజల ప్రయోజనం తెలుసుకోండి.

-

అవిసె గింజలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. అంతే కాదు ఇవి చర్మ సంరక్షణకి బాగా ఉపయోగపడతాయి. ఇందులో ఒమెగా 3కొవ్వు ఆమ్లాలు, ఫైబర్ ఉంటుంది. ఇంకా యాంటీఆక్సిడెంట్లు, ఫైటోకెమికల్స్ పుష్కలంగా ఉంటాయి కాబట్టి చర్మ సంరక్షణకి మేలు చేస్తాయి. ఈ అవిసె గింజలతో తయారు చేసిన జెల్ కారణంగా వృద్ధాప్య ఛాయలు తగ్గుతాయి. చర్మం యవ్వనంగా ఉంటుంది.

 

అవిసె గింజల జెల్ ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు

2కప్పుల నీరు
1/2కప్పుల అవిసె గింజలు

తయారీ విధానం

మొదట చిన్న పాత్ర తీసుకుని అందులో అవిసె గింజలు ఉంచండి. ఆ తర్వాత నీళ్ళు పోయండి. దీన్ని పొయ్యి మీద పెట్టి మంట వెలిగించండి. కొద్దిగా ఉడికే వరకు అలాగే ఉంచండి. పొయ్యి మీద ఉడుకుతుంటే జెల్ గా మారుతున్నట్లు మీకు అర్థం అవుతుంది. అప్పుడు పొయ్యి మీద నుండి కిందకు తీసి వడపోయండి. అప్పుడు స్వఛ్ఛమైన జెల్ మాత్రమే వస్తుంది. పూర్తిగా చల్లారిన తర్వాత డబ్బాలో నిల్వ చేసుకోవచ్చు. ఈ డబ్బాని రిఫ్రిజిరేటర్లో ఉంచుకుని నెల రోజుల పాటు వాడుకోవచ్చు. సువాసన కోసం ఏదైనా ఆయిల్ ని వాడుకోవచ్చు.

ఎలా వాడాలంటే:

ముందుగా ముఖాన్ని శుభ్రంగా కడగండి. ఆ తర్వాత పూర్తిగా ఆరిన తర్వాత జెల్ తీసుకుని ముఖం, మెడ భాగాల్లో వర్తించండి. 10, 15నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే సరిపోతుంది.

ప్రయోజనాలు:

ఇది చర్మాన్ని తేమగా ఉంచుతుంది. మెరిసే యవ్వన చర్మాన్ని మీకు అందిస్తుంది. ఒమెగా 3కొవ్వు ఆమ్లాలు ఉంటాయి కాబట్టి పొడిబారిన చర్మం నుండి విముక్తి కలుగుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news