చుండ్రు నివారణకి ఆయుర్వేద చిట్కాలు…!

-

నేటి కాలంలో పెరుగుతున్న పని ఒత్తిడి, ఆరోగ్య సమస్యలు, ఇంకా పెరుగుతున్న కాలుష్యం వల్ల శరీరానికే కాక తల వెంట్రుకలకు కావలసిన పోషకాలు అందక తలలో చుండ్రు, జుట్టు రాలుట వంటి అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. అయితే దీనికి నాసిరకం షాంపుల వాడకం కూడా ఒక కారణం. అయితే ఆయుర్వేదంలో చుండ్రు సమస్యను పూర్తిగా తగ్గించుకోవచ్చు. ఆయుర్వేదంలో మందుల తయారీకి సహజ పదార్థాలను వాడటం వల్ల ఏ విధమైన హానికర ప్రభావం ఉండదు.

ఆయుర్వేదంలో హెయిర్ ఆయిల్స్ లాగా వేప నూనె, కొబ్బరి నూనె ఉపయోగించి తయారు చేయడం వల్ల చుండ్రు సమస్యను సమర్థవంతంగా ఎదుర్కొంటుంది. జుట్టుకు బలాన్ని అందించే పొడిని గోరింటాకు, ఉసిరి, మందార ఆకులు, రుద్రాక్ష, కష్మీర చెట్టు, బృంగ్ రాజ్ కలిపి తయారు చేస్తారు. ఆయుర్వేద షాంపులలో శిఖా కాయ, రితాలు కలిపి ఉండటం వల్ల ఇవి జుట్టుని శుభ్ర పరుస్తాయి. ఆయుర్వేద కండిషనర్లగా మెంతులు, నారింజ మరియు నిమ్మ యొక్క సారములు కలిగి ఉంటాయి. ఇంకా చుండ్రు నివారణకి వారానికి రెండు సార్లు గోరు వెచ్చని కొబ్బరి నూనెతో మర్దనా చేయాలి.

ఒక రాత్రి అంతా మెంతులను పెరుగులో నానపెట్టి ఉదయాన్నే రుబ్బి తలకు పట్టించాలి. ఒక గంట తరువాత కుంకుడుకాయల రసంతో తలస్నానం చేయాలి. ఇది మంచి ఫలితాన్ని ఇస్తుంది. నీటిలో వేపాకులు వేసి మరిగించి ఆ నీటిని జుట్టు కడగటానికి ఉపయోగించాలి. తులసి ఆకులను, ఉసిరిని కలిపి పేస్ట్ లా చేసి జుట్టుకి పట్టించి ఒక గంట తరువాత కడిగేయాలి. నిమ్మరసం, వెనిగర్ సమానంగా తీసుకుని జుట్టుకి రాసి తరువాత తేలికపాటి షాంపుతో కడగాలి. కలబంద గుజ్జు జుట్టుకి మర్దనా చేసి పదిహేను నిమిషాల తరువాత షాంపుతో శుభ్రం చేయాలి.

Read more RELATED
Recommended to you

Latest news