ఇలా చేస్తే అందమైన కురులు మీ సొంతం…!

-

చాలా మంది కురులు అందంగా ఉండాలంటే ఏవేవో పాటించాలని క్రమం తప్పకుండా హెయిర్
స్పా లాంటి చోట్లకి వెళ్లాలని అనుకుంటూ ఉంటారు. కానీ నిజంగా మన ఇంట్లోనే ఈ చిన్న చిన్న చిట్కాలను పాటించి అందమైన కురులు సొంతం చేసుకోవచ్చు. అయితే అందమైన కురులు కావాలనుకున్న ప్రతి ఒక్కరికి ఈ విషయాలు తెలియాలి. మరి ఇక ఆలస్యం ఎందుకు దాని కోసం పూర్తిగా చూసేయండి.

జుట్టు ఆరోగ్యకరంగా షైనీ గా ఉండాలి అంటే మీరు ముందు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. మీ డైట్ లో మంచి న్యూట్రియంట్స్ ఉండేటట్టు చూసుకోవాలి. అలానే సమతుల్యమైన డైట్ పాటించాలి. ఇలా చేయడం వల్ల ఏ షాంపూ వాడిన ఏ కండిషనర్ వాడిన వచ్చే రిజల్ట్ కంటే ఆహారం ద్వారా వచ్చే ఫలితం బాగుంటుంది.

అదే విధంగా మీరు ప్రతి రోజు ఎనిమిది నుంచి పది గ్లాసుల మంచినీళ్లు తీసుకోవాలి. జుట్టు కి 25 శాతం నీళ్లు అవసరం. కాబట్టి ఎక్కువగా నీళ్లు తీసుకోవడం మంచి ఆహారం తీసుకోవడం చేయాలి.

తలస్నానం చేసిన తర్వాత టవల్ తీసుకుని నెమ్మదిగా వత్తండి. ఒత్తిడి పెట్టి రబ్ చేయొద్దు. అలానే హెయిర్ డ్రయ్యర్, హాట్ రోలర్స్ ఇలా ఆర్టిఫిషియల్ హీటింగ్ ఇచ్చే వాటిని ఉపయోగించద్దు. మీరు చేసేది ఏమైనా నేచురల్ గా ఉండేటట్లు చూసుకోండి.

తడి జుట్టు మీద దువ్వాల్సి వస్తే మీరు పెద్ద పళ్ళు ఉన్న దువ్వెన వాడండి. దగ్గరగా ఉండే దువ్వెనతో తడి జుట్టు మీద దువ్వడం వల్ల హెయిర్ లాస్ అవుతుంది. అదేవిధంగా సరైన దువ్వెన ఉపయోగించినట్లయితే జుట్టు డ్యామేజ్ అవుతుంది.

అలానే స్ప్లిట్ ఎండ్స్ ఉన్నప్పుడు వాటిని తొలగించుకోవాలి. దాని వల్ల కూడా మీకు మంచి జుట్టు ఉంటుంది. అలాగే జుట్టు ఊడి పోతున్నట్లు అయితే మీరు ఇంట్లోనే సింపుల్ హోమ్ మేడ్ ఉపయోగించవచ్చు. బయోటిన్ ని ఉపయోగించడం వల్ల కొత్త జుట్టు వస్తుంది.

అరటి పండ్లలో తేనే, పెరుగు, పాలు వేసి తీసుకుంటే కూడా మీకు మంచి బెనిఫిట్ ఉంటుంది. విటమిన్ బి 6, జింక్ సప్లిమెంట్స్ ను ఉపయోగించడం వల్ల కూడా జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది ఎక్కువగా వర్క్ వల్ల వచ్చే ఒత్తిడి వల్ల కూడా జుట్టు ఊడిపోవడానికి కారణమవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news