ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ వలన యూకే మహిళ ఏకంగా కాళ్ళనే తొలగించుకోవాల్సి వచ్చింది…!

-

కరోనా వైరస్ తీవ్రత ఎక్కువైపోయింది. చాలా దేశాలలో వివిధ రకాల వ్యాక్సిన్స్ ఉపయోగిస్తున్నారు. వివిధ రకాల దేశాలు వాళ్ళ వ్యాక్సిన్ మంచిగా పని చేస్తోందని చెప్తున్నారు. అయితే వాటికి సంబంధించి పలు విషయాలు కూడా బయటకు వచ్చాయి. యూకే లో కరోనా వైరస్ తో పోరాడటానికి ఆస్ట్రోజెనికా అనే ఒక వ్యాక్సిన్ ని కనుగొన్నారు. అయితే ఆ వ్యాక్సిన్ వేయించుకున్న తరువాత ఎన్నో సైడ్ఎఫెక్ట్స్ వస్తున్నాయి. 34 ఏళ్ల Sarah Beuckmann తన పరిస్థితిని షేర్ చేసుకుంది.

ఆస్ట్రాజెనికా వాక్సిన్ వేయించుకున్న తర్వాత ఆమెకి కలిగిన ఇబ్బందుల గురించి చెప్పింది. ఆ
వ్యాక్సిన్ మొదటి డోస్ వేయించుకున్న తర్వాత కళ్ళల్లో నొప్పి ఉన్నట్టు చెప్పింది. ఆ తర్వాత ఆమె కాళ్ళు కట్ చేయించుకోవాల్సి వచ్చింది. జీవితం సేవ్ చేసుకోవడానికి ఆమె ఈ పని చేయవలసి వచ్చిందని కేవలం వ్యాక్సిన్ వేయించుకున్న ఆరు రోజులకే ఈ విషయం జరిగిందని అన్నారు.

వ్యాక్సిన్ మొదటి డోస్ వేసుకున్న తర్వాత ఆమెకి జలుబు, దగ్గు ఉందని.. అయితే ఇవి చాలా కామన్ లక్షణాలనే అనుకున్నారు. అయితే ఆరు రోజుల తర్వాత ఆమె పాదాల మీద ర్యాషెస్ లాంటివి వచ్చాయి. ఇది వచ్చిన కొన్ని రోజులకి తీవ్రత మరింత ఎక్కువైపోయింది.

కాళ్ళు మీద ఉండే పండ్ల నుంచి రక్తం కూడా వచ్చేది. డాక్టర్ని కన్సల్ట్ చేయగా ఆమెకి చాలా రేర్ ఇన్ఫెక్షన్ సోకిందని వ్యాక్సిన్ కారణంగా ఇలా జరిగిందని అన్నారు. ఆమె పరిస్థితి చూసిన తర్వాత రెండో తీసుకో వద్దని చెప్పారు. ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ ని ప్రపంచంలో 20 మిలియన్ మంది తీసుకోవడం జరిగింది. అయితే వాళ్లలో కేవలం ఒక శాతం మందికి మాత్రమే సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news