మీ చేతికి ఉన్న హెన్నా పూర్తిగా తొలగిపోవాలా..? అయితే ఈ ఈజీ ట్రిక్స్ మీకోసం..!

-

 

చాలామంది హెన్నా పెట్టుకుంటారు. హెన్నా పెట్టుకున్నప్పుడు కొన్ని రోజులు చాలా బాగుంటుంది. అందంగా కనపడుతుంది. ఆ తర్వాత సగం సగం ఉండి సగం పోతుంది. అలాంటప్పుడు చేతులు చూడడానికి బాగుండదు. హెన్నాని తొలగించాలంటే ఇలా చేయొచ్చు. హెన్నాని తొలగించడానికి సాల్ట్ బాగా ఉపయోగపడుతుంది. కొంచెం సాల్ట్ ని నీళ్లలో లేదా నూనెలో వేసి చేతులకి అప్లై చేసి నెమ్మదిగా తొలగించండి. ఇలా హెన్నాని తొలగించడానికి అవుతుంది. కాసేపు తర్వాత గోరువెచ్చని నీటితో చేతులు కడిగేసుకోండి.

బేకింగ్ సోడాలో కొంచెం నిమ్మరసం వేసి చేతులకి పట్టించి నెమ్మదిగా రుద్దితే హెన్నా మరకలు పోతాయి. పది నుంచి పదిహేను నిమిషాల పాటు వదిలేసి తర్వాత గోరువెచ్చనితో కడిగేసుకుంటే బావుంటుంది. టూత్ పేస్ట్ ని అప్లై చేస్తే కూడా హెన్నా మరకలు పోతాయి. టూత్ పేస్ట్ ఒకసారి చేతులు బాగా రుద్దండి ఆ తర్వాత చేతులు వాష్ చేసుకోండి.

గోరువెచ్చని నీళ్లలో కొద్దిగా ఆలివ్ ఆయిల్ వేసి చేతుల్ని ఉంచండి. 15 నిమిషాల తర్వాత చేతులు కడిగేసుకోండి ఇలా చేస్తే కూడా సులువుగా హెన్నా పోతుంది. ఎక్స్ప్యాలియెట్ స్క్రబ్ కూడా బాగుంటుంది. బయట ఉన్న ఎక్స్ప్యాలియెట్ స్క్రబ్ ని చేతులకి అప్లై చేయడం వలన హెన్నా మరకలు పోతాయి. హెన్నాని తొలగించాలంటే ఈజీగా ఈ టిప్స్ ని ఫాలో అయ్యి పోగొట్టుకోవచ్చు కావాలంటే ఈసారి ట్రై చేయండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version