జుట్టుకు రోజ్‌మెరీ ఆయిల్‌ మంచిదేనా..? వాడితే ఏం అవుతుందంటే..

-

పొడవాటి ఆరోగ్యకరమైన మరియు అందమైన జుట్టును కావాలి అని ప్రతి అమ్మాయి కోరుకుంటుంది. హెయిర్‌ గ్రోత్‌ కోసం ఆడవాళ్లు చాలా ఖర్చు, అంతే శ్రద్ధ కూడా పెడతారు. ఎందుకంటే.. వారి అందంలో జుట్టు అనేది కీ రోల్‌ ప్లే చేస్తుంది కాబట్టి. మీ జుట్టు ఒత్తుగా పెరగాలంటే.. రోజ్‌మెరీ ఆయిల్‌ను ట్రై చేయండి. ఇది జుట్టుకు చాలా బాగా పనిచేస్తుంది. జుట్టును సహజంగా ఆరోగ్యంగా ఉంచడంలో రోజ్మేరీ ఆయిల్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. రోజ్‌మేరీ ఆయిల్‌లో ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి, ఇది జుట్టుకు శక్తినిస్తుంది. జుట్టు సమస్యలను నయం చేస్తుంది.

ఈ నూనె స్కాల్ప్ నుంచి చుండ్రును తొలగించడానికి, జుట్టును బలోపేతం చేయడానికి, నల్లగా మార్చడానికి, జుట్టు రాలడాన్ని నిరోధించడానికి, జుట్టును ఒత్తుగా మరియు ఆరోగ్యంగా మార్చడానికి, రక్త ప్రసరణను మెరుగుపరచడానికి మరియు కొత్త జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడానికి చాలా సహాయపడుతుంది. అంతే కాకుండా, రోజ్‌మేరీ ఆయిల్‌లోని యాంటీఆక్సిడెంట్లు మరియు యాంటీ అలర్జీ లక్షణాలు మీ జుట్టు మరియు స్కాల్ప్‌ను సురక్షితంగా ఉంచుతాయి. దీని సహాయంతో మీ జుట్టు బలంగా మారుతుంది.

జుట్టు రాలడం నుంచి బయటపడేందుకు కొబ్బరినూనె, రోజ్‌మేరీ ఆయిల్‌ కలిపి తలకు పట్టించి, 15 నిమిషాల తర్వాత షాంపూ రాసుకుని తలస్నానం చేయాలి. మీకు నెరిసిన జుట్టు ఉంటే, రోజ్‌మేరీ ఆయిల్‌తో కొంచెం బాదం నూనెను కలిపి మీ తలపై మసాజ్ చేయండి. ఈ రెండు నూనెలు జుట్టు యొక్క కొల్లాజెన్‌ను పెంచుతాయి మరియు జుట్టు యొక్క రంగును మెరుగుపరుస్తాయి. తెల్ల జుట్టు వెంటనే నల్లగా మారుతుంది. అదేవిధంగా, మీరు చుండ్రు మరియు దురదను వదిలించుకోవడానికి రోజ్మేరీ నూనెతో మీ తలకు మసాజ్ చేయవచ్చు.

3 చెంచాల రోజ్‌మేరీ ఆయిల్‌కు 3 చెంచాల హెన్నా పౌడర్‌ను మిక్స్ చేసి జుట్టుకు అప్లై చేయడం వల్ల జుట్టు మెరుపు పెరుగుతుంది. తర్వాత షాంపూ రాసుకుని తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టు రాలే సమస్యలను దూరం చేసి మీ జుట్టు నిగనిగలాడేలా చేస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version