మీ చర్మ సౌందర్యానికి సీరం ఎందుకు అవసరమో తెలుసుకోండి.

-

చర్మ సంరక్షణ గురించి ఇంటర్నెట్ లో ఎంత సమాచారం ఉందో చెప్పాల్సిన పనిలేదు. అవన్నీ చర్మాన్ని సురక్షితంగా ఉంచేవే. కానీ మీ చర్మం రకం ఎలాంటిదో తెలుసుకోకుండా వాటిని వాడడం కరెక్ట్ కాదని గుర్తించాలి. ఏదైనా సరే ఒక చర్మ సాధనం వాడుతున్నారంటే అది మీ చర్మ రకానికి సరైనదేనా అనేది గుర్తించాలి. అలా గుర్తించలేనపుడు చర్మ సాధనాలు మీపై సరిగ్గా పనిచేయవు. ఇలాంటి టైమ్ లో ఆ సాధనాన్ని తిడుతూ కాలం వెళ్ళదీస్తారు. అదంతా అటుంచితే చర్మానికి సీరం చేసే మేలు తప్పక తెలుసుకోవాలి. అదే కాదు అసలు సీరం ఎందుకు అవసరమో కూడా గుర్తించాలి.

సీరంని చర్మానికి అప్లై చేయడం వల్ల అనేక సమస్యలు దూరమవుతాయి. సీరం అనేది చిన్న చిన్న అణువులతో తయారవుతుంది. ఇది కొల్లాజెన్ ని ఉత్పత్తి చేయడంలో తోడ్పడమే కాకుండా ముడుతలు, గీతలు ఏర్పడకుండా కాపాడుతుంది. దీనివల్ల ఇంకా చాలా లాభాలున్నాయి. ఉదాహరణకి విటమిన్ సి కలిగిన సీరంని వాడడం వల్ల వయసు పెరుగుతున్నప్పుడు ఏర్పడే చర్మ సమస్యలని దూరం పెట్టి నిత్య యవ్వనంగా ఉంచుతుంది. ఇంకా నల్లమచ్చలు, మొటిమలు ఏర్పడకుండా చూసుకుంటుంది.

సీరంని ఎలా వాడాలి?

ముందుగా ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. మీకు కావాల్సిన సీరంని ఎంచుకోండి. అంటే మీ చర్మంపై ఉన్న గీతలని పోగొట్టుకోవాంటే రెటినాల్ బేస్ సీరంని వాడాలి. మీ చర్మం రంగు మారడానికి విటమిన్ సి సీరం వాడడం ఉత్తమం.

ముందుగా సీరంని ముఖానికి అద్దుకోవాలి. మెల్లగా ముఖం అంతటా రాసుకోవాలి. ఆ తర్వాత మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ లోషన్ పెట్టుకుంటే సరిపోతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version