కళ్ళకింద నల్లటి వలయాలను పోగొట్టుకునేందుకు విటమిన్ సి చేసే మేలు..

-

ముఖంపై వికారంగా ఉండి చూడడానికి ఎబ్బెట్టుగా కనిపించే నల్లటి వలయాలు ఏర్పడడానికి చాలా కారణాలున్నాయి. నిద్ర లేకపోవడం అందులో ముఖ్య కారణం. అదొక్కటే కాదు ఇంకా చాలా కారణాలున్నాయి. ఆ చాలా రకాల కారణాల్లో శరీరానికి పోషకాలు సరిగ్గా అందకపోవడం, ఒత్తిడి, విటమిన్ సి లోప మొదలగునవు ఉన్నాయి. ఎక్కువగా ఎండలో తిరగడం, సరైన సమయంలో ఆహారం తినకపోవడం, పెరుగుతున్న వయస్సు మొదలగునవి కళ్ళకింద నల్లటి వలయాలకి కారణాలుగా మిగులుతాయి.

ఈ నల్లటి వలయాలని పోగొట్టుకోవడానికి పైన చెప్పిన వాటిని సక్రమంగా పాటిస్తే సరిపోతుంది. అంటే కావాల్సినంత సేపు నిద్రపోవడం, వేళకు భోజనం చేయడం, ఎండలో ఎక్కువగా తిరగకుండా ఉండడం, ఎక్కువగా తిరిగితే సన్ స్క్రీన్ లోషన్ పెట్టుకోవడం చేసినా సరిపోతుంది. ఐతే కొన్ని సార్లు మనకి తెలియకుండా కళ్లకింద నల్లటి వలయాలు వచ్చేస్తాయి. వాటిని పోగొట్టుకోవాలంటే శరీరానికి విటమిన్ సి అవసరం చాలా ఉంటుంది.

విటమిన్ సి మీ ఆరోగ్యాన్ని పెంచుతుంది. చర్మ ఆరోగ్యాన్ని మరింతగా పెంచి చర్మ సమస్యల నుండి విముక్తి కలిగిస్తుంది. విటమిన్ సి వల్ల చర్మం మృదువుగా మారుతుంది. కొల్లాజెన్ ని ఉత్పత్తి చేసి మృదువుగా మార్చడంతో పాటు రక్తప్రసరణని మెరుగుపరుస్తుంది. అందుకే చర్మ సమస్యల నుండి దూరం కావడానికి విటమిన్ సి కలిగిన చర్మ సంరక్షణ సాధనాలను వాడడం ఉత్తమం. అలా కాకుంటే విటమిన్ సి కలిగిన ఆహారాలను తీసుకున్నా బాగుంటుంది.

సిట్రస్ ఫలాలైన నిమ్మ, నారింజ, జామ మొదలగు వాటిలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. చర్మం సురక్షితంగా ఉండడానికి ఇవి ఎంతో మేలు చేస్తాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version