చర్మం మీద ముడుతలు పడి ముసలివాళ్ళలా కనిపిస్తున్నారా..? బెండకాయ చేసే అద్భుతం తెలుసుకోండి

-

బెండకాయ.. మార్కెట్లో సంవత్సరం మొత్తం దొరికే ఈ కూరగాయ వల్ల చర్మానికి అనేక లాభాలు ఉన్నాయి. బెండకాయల నుండి వచ్చే జిగురు.. చర్మాన్ని మృదువుగా ఉంచడంలో, తేమగా ఉంచడంలో సహాయపడుతుంది. ఈ మధ్యకాలంలో బ్యూటీ రంగంలో బెండకాయ చేసే మేలు గురించి ప్రధానంగా వివరిస్తున్నారు.

ప్రస్తుతం బెండకాయ వల్ల చర్మానికి కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం.

బెండకాయలో విటమిన్ A, C, ఇంకా యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు ఇందులో జింక్ ఉంటుంది. వీటి కారణంగా చర్మం మృదువుగా ఆరోగ్యంగా తయారవుతుంది.

బెండకాయల నుండి వచ్చే జిగురు.. చర్మానికి సహజ మాయిశ్చరైజర్ గా పని చేస్తుంది. ఇది కొల్లాజెన్ ఉత్పత్తిలో తోడ్పడి.. చర్మంపై ముడతలు పడకుండా, గీతలు పడకుండా కాపాడుతుంది.

బెండకాయ జిగురును ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అదెలానో తెలుసుకుందాం.

బెండకాయలను తీసుకుని వాటిని ముక్కలుగా చేసి ఒక పాత్రలో వేసి అందులో నీళ్లను పోసి బాగా మరిగించాలి. కాసేపయిన తర్వాత.. బెండకాయల్లోని జిగురు నీటిలో మరుగుతుంది. ఇప్పుడు వడపోసి జిగురును ఒక బాటిల్లో నిల్వ ఉంచుకుని ఫ్రిజ్ లో పెట్టుకోవాలి. ఈ జిగురును రెండు వారాల వరకు ఉపయోగించవచ్చు.

దీన్ని ఎలా వాడాలంటే..?

ఈ జిగురును ప్రతిరోజు వాడవచ్చు. దీన్ని డైరెక్ట్ గా యూస్ చేయవచ్చు, లేదంటే మీరు రోజు వాడే మాయిశ్చరైజర్ లో కొన్ని చుక్కలు కలుపుకొని యూస్ చేయవచ్చు.

ఇలా రోజూ వాడడం వల్ల చర్మం మీద నల్ల మచ్చలు తొలగిపోతాయి. చర్మం మృదువుగా తయారవుతుంది. చర్మం మీద ముడతలు, గీతలు ఏర్పడకుండా ఉంటాయి.

గమనిక: ఈ సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది, కేవలం అవగాహన కోసం మాత్రమే. “మనలోకం” ధృవీకరించడలేదు. పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

Read more RELATED
Recommended to you

Latest news