ప్రభుత్వ రంగ సంస్థలు దేశ సంపదను కేంద్రంలోని బీజేపీ పెద్దలు అదానికి అప్పనంగా కట్టబెడుతున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అదానీ పై రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు కేంద్రంలోని బీజేపీ పెద్దలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను, దేశ సంపదను అప్పనంగా అదానికి కట్టబడెడుతున్నారని ఫైర్ అయ్యారు.
తెలంగాణ ప్రభుత్వం నిబంధనల మేరకే పరిశ్రమల ఏర్పాటుకు ఒప్పందం చేసుకుందని తెలిపారు. పారిశ్రామిక వేత్తలు ఎవరైనా రాష్ట్రానికి రావచ్చని తెలిపారు. రాష్ట్ర సంపద ప్రజలకే చెందాలన్నది తమ విధానమని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ ఆలోచనలకు తగ్గట్టుగానే తాము నడుచుకుంటామని తెలిపారు భట్టి విక్రమార్క. బిలియన్ డాలర్ల లంచం, మోసం ఆరోపణలపై అమెరికాలో కేసు నమోదైన అదానీ గ్రూపు చైర్మన్ గౌతమ్ అదానీ పై లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదానీ ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.