కళ్లజోడు వల్ల ముక్కమీద మచ్చలా..? ఇలా చేసేయండి..!

-

కళ్లజోడు లేందే కొంతమందికి కనిపించదు. ఇక సిస్టమ్‌ చూసేపని అయితే.. కళ్లు దెబ్బతినకుండా వాడతాం. ఇలా కారణం ఏదైనా జోళ్లు పెట్టుకునే వారి సంఖ్య విపరీతంగా పెరిగింది. దీనివల్ల ముక్కు మీద మచ్చలు, కంటి కింద మచ్చలు ఉంటాయి. ఇలా మచ్చలు ఉంటే మనకు నచ్చదు. అలా అని వాడటం మానేద్దామా అంటే అవ్వదు. కళ్లజోడు వల్ల ఏర్పడ్డ మచ్చలను తొలగించే అద్భుతమైన చిట్కాలు కొన్ని ఉన్నాయి.. అవేంటో చూద్దామా..!

అందరికీ అందుబాటులో ఉండే సహజమైన పదార్థాల్లో కలబంద ఒకటి. కళ్లద్దాల వల్ల ముక్కు మీద ఏర్పడే మచ్చలను తగ్గించడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. కలబంద రసం లేదా అందులో ఉండే జిగురు లాంటి పదార్థాన్ని (జెల్) తీసుకుని మచ్చలు ఉన్న చోట అప్త్లె చేయాలి. ఇది సమస్య నుంచి తొందరగా ఉపశమనాన్ని ఇస్తుంది.

ఫేషియల్స్ వేసుకున్నప్పుడు కళ్లు విశ్రాంతి పొందడానికి, చల్లగా ఉండటానికి కళ్ల పైన కీరాదోస ముక్కలు పెడతాం. అయితే ఇదే కీరా వల్ల ముక్కు మీద ఏర్పడే మచ్చలు కూడా తగ్గుతాయి. కీరాదోస ముక్కతో మచ్చలు ఉన్న చోట రుద్దుకోవచ్చు లేదా కీరా రసానికి బంగాళాదుంప, టమాటా రసం కలిపి ఈ మిశ్రమాన్ని మచ్చలు ఉన్న చోట రాయాలి. బాగా ఆరనిచ్చి తర్వాత చల్లని నీళ్లతో శుభ్రం చేసుకోవాలి.

నారింజ తొక్కల పొడి, పాలు, పెరుగు, బంగాళాదుంప, టమాటా.. ఇలాంటి పదార్థాలను ఉపయోగించి మచ్చలు తగ్గించుకోవడానికి ప్రయత్నించవచ్చు.

అలాగే సబ్బు, గోరు వెచ్చటి నీరు ఉపయోగించి కళ్లద్దాలను శుభ్రపరచాలి. లేదంటే కళ్లద్దాలపై ఏర్పడే బ్యాక్టీరియా వల్ల కళ్లు ఎర్రగా అయిపోవడం, కంటి చుట్టూ చర్మం నల్లగా మారిపోవడం, మచ్చలు ఏర్పడటం జరుగుతుంది.

అలాగే రోజూ తగినన్ని నీళ్లు తాగుతుంటే రక్త ప్రసరణ బాగుంటుంది.

కళ్లద్దాలతో ఎక్కువగా అవసరం లేనప్పుడు వాటిని తీసేస్తూ ఉండాలి.

అలాగే కళ్లద్దాలు వాడుతున్నప్పుడే రెండు గంటలకు ఒకసారి తీసి క్లాత్‌తో ముక్క దగ్గర, కళ్ల కింద తుడుచుకుంటుండాలి.

Read more RELATED
Recommended to you

Latest news