మీ అందాన్ని రెట్టింపు చేసే ఆహార పదార్ధాలు ఇవే…!

మనం తినే తిండి మీద అందం, ఆరోగ్యం ఆధారపడివుంది. కాబట్టి మీ అందాన్ని పెంచుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా తీసుకునే తిండి లో కూడా పలు మార్పులు చేసుకోవాలి. ఇలా కనుక చేస్తే మీ అందం మరెంత రెట్టింపు అవుతుంది. మరి ఆ ఆహార పదార్ధాలు ఏమిటో ఇప్పుడే క్లుప్తంగా చూసేయండి. స్ట్రాబెర్రీ పండ్లలో విటమిన్ ‘సి’ మరియు ఫోలిక్ యాసిడ్ అధికంగా ఉంటాయి. ఇది మంచి ఫలితం చూపిస్తుంది. చర్మం పై భాగం లో కనిపించే చనిపోయిన కణాలను తొలగించడం చేస్తుంది. ఇలా చేయడం వల్ల ఆరోగ్యకరమైన చర్మం అభివృద్ధికి సహాయపడుతుంది. చూసారా ఎంత మంచిగా స్ట్రాబెర్రీ అందాన్ని పెంచుతుందో…!

ప్రతి రోజూ స్ట్రాబెర్రీలను తీసుకుంటే మీ చర్మం ప్రకాశవంతంగా కనిపిస్తుంది. సూర్యుని అతినీలలోహిత కిరణాల నుండి మీ చర్మాన్ని రక్షించడంలో సహాయపడతాయి. అంతే కాదు చర్మం పై మరకలు లేదా ముడతలు కూడా మీ దరి చేరవు. మీ అందాన్ని రెట్టింపు చేయడానికి చిలకడ దుంప కూడా మంచిగా పని చేస్తుంది. వీటిలో బీటా- కెరోటిన్ ఉంటుంది. శీతాకాలంలో తలెత్తే చర్మ సమస్యలు, చర్మ వ్యాధుల నుండి కూడా ఇది కాపాడుతుంది. పొడి చర్మం ఉన్నవారికి చర్మ సమస్యలు ఎక్కువ. వారు దీనిని తీసుకుంటే చర్మానికి ఎక్కువ నీరు అందించి చర్మ సమస్యల నుండి తేలికగా బయట పడేస్తుంది.

అవోకాడో కూడా మంచి ఫలితం చూపుతుంది. ఈ పండ్లలో మానవ శరీరానికి అవసరమైన ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. చర్మాన్ని తేమ చేస్తాయి ఇవి. అధిక కొవ్వు ఆమ్లం, ప్రోటీన్ మరియు విటమిన్ ‘ఎ’, విటమిన్ ‘డి’, విటమిన్ ‘ఇ’ శరీరంలో కొల్లాజెన్ కంటెంట్‌ను ఉత్పత్తి చేయడానికి సహాయపడతాయి. కనుక వీటిని కూడా మీ డైట్ లో చేర్చితే మంచి ఫలితం ఉంటుంది.