హైపర్ పిగ్మెంటేషన్ తో బాధ పడుతున్నారా..? అయితే ఈ ఇంటి చిట్కాలు మీకోసం…!

-

యువి కిరణాలు, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, స్మోకింగ్, ఎలర్జీలు, గాయాలు, క్యాన్సర్ చికిత్స, ఆల్కహాల్ తీసుకోవడం ఇలా వివిధ రకాల సమస్యల కారణంగా హైపర్ పిగ్మెంటేషన్ వస్తుంది. దీనిని తొలగించడానికి ఇంటి చిట్కాలు మీకోసం..

నిమ్మ రసం:

నిమ్మ రసం లో నేచురల్ బ్లీచింగ్ ఏజెంట్స్ ఉన్నాయి. ఇవి ముఖం మీద ఉండే డార్క్ స్పాట్స్ ని తగ్గిస్తాయి. దీని కోసం మీరు ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్స్ నిమ్మ రసాన్ని నీళ్ల లో కలిపి దానిలో విటమిన్ ఇ ఆయిల్ యాడ్ చేసి డార్క్ స్పాట్స్ మీద అప్లై చేయండి. పదిహేను నిమిషాలు పాటు ఇలా ఉంచి ఆ తర్వాత ముఖాన్ని కడిగేయండి.

అలోవెరా జెల్:

అలోవెరా జెల్ లో మంచి గుణాలు ఉన్నాయి. అలానే దీనిలో స్కిన్ లైటనింగ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. దీని కోసం ముందుగా కలబంద మట్ట తీసుకొని గుజ్జు తీసేయండి. దానిని మచ్చలు
ఉన్న ప్రాంతం లో అప్లై చేయండి. ఇరవై నిమిషాల తర్వాత ముఖాన్ని శుభ్రంగా కడిగేయండి.

పసుపు:

దీని కోసం మీరు కొద్దిగా పసుపు తీసుకొని అందులో పాలు వేసి పేస్ట్ లాగ చేయండి కావాలంటే కొద్దిగా నిమ్మ రసం కూడా వేసుకోవచ్చు. ఈ పేస్ట్ ను ముఖం మీద అప్లై చేసి 20 నిమిషాల పాటు ఉంచి ఆ తర్వాత కడిగేయండి. దీనితో మీకు మంచి బెనిఫిట్స్ ఉంటాయి.

గులాబీ రేకులు:

దీని కోసం ముందుగా గులాబీ రేకుల్ని పాలల్లో వేసి నానబెట్టండి. అరగంట తర్వాత దీనిని పేస్ట్ లాగ చేయండి పదిహేను నిమిషాలు పాటు దీనిని ముఖం మీద ఉంచుకుని తర్వాత కడిగేయండి. ఒకవేళ మీకు ఈ పేస్ట్ కాస్త థిక్ గా రావాలంటే కొద్దిగా గంధం పొడి కలుపుకోండి. ఇలా మీరు ఈ సమస్య నుండి ఈజీగా బయట పడచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news