టీఆర్ ఎస్ లో ఎంత కీలక పదవి ఉన్నా.. అధికారం మాత్రం చేతుల్లో ఉండదని ఇప్పటికే చాలామంది ప్రజాప్రతినిధులు వాపోయారు. మరి ఇంత అసంతృప్తి ఉన్నా.. ఎందుకు మౌనంగా ఉంటున్నారనేదే ప్రశ్న. తన ఆత్మగౌరవం కంటే ఏది ఎక్కువ కాదని చెప్పిన ఈటల.. ఇప్పుడు ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసేందుకు కూడా సిద్ధమయ్యారు. మరి ఇలాంటి టైమ్ లో ఉ్మమడి కరీంనగర్ నాయకులు, ఉమ్మడి ఆదిలాబాద్ నాయకులు ఆయనకు ఎందుకు అండగా నిలవట్లేదు.
మొదటి నుంచి ఉద్యమంలో ఉన్న ఈటల లాంటి నాయకుడే బయటకు వచ్చాక కూడా ఎందుకు టీఆర్ ఎస్ నాయకులు మౌనంగా ఉంటున్నారు. ఈ రెండు జిల్లాల్లో నాయకులకు అండగా ఉండేది ఈటల రాజేందర్. వారందరూ ఎదగడానికి కారణం కూడా ఈటలనే. మరి ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో వారంతా ఈటల వెనక ఎందుకు నడవట్లేదు? ఆయనకు ఎందుకు మద్దతు తెలపట్లేదనేది ఇక్కడ ప్రశ్న.
కేవలం హుజూరాబాద్ నియోజకవర్గ నాయకులు తప్ప.. ఏ ఒక్క పెద్ద లీడర్ కూడా ఇప్పటి వరకు ఈటలను కలిసి పరామర్శించలేదు. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఈటల.. మొదటినుంచి టీఆర్ ఎస్‌లోనే ఉన్నారు. అలాంటి నేతకు సన్నిహితులైన ఎమ్మెల్యేలు, మంత్రులు లేరా అంటే ఉన్నారు. కానీ వారు టైమ్ కోసం ఎదురు చూస్తున్నారా అనేది తెలియట్లేదు. కానీ అందరిలోనూ ఆందోళన మొదలైంది. ఈటల లాంటి కేసీఆర్ కుడి భుజానికే విలువ లేదంటే.. రేపు తమ పరిస్థితి ఏంటా అని టీఆర్ ఎస్ నేతలు ఇప్పటికే మదన పడుతున్నారు. మరి ఈటలకు బాసటగా ముందు ముందు ఎవరైనా వస్తారా లేదా చూడాలి.