మగవాళ్ళు హ్యాండ్ సమ్ గా కనిపించడానికి కావాల్సిన చిట్కాలు..

-

అందంగా కనిపించాలని ఎవరికి అనిపించదు? ప్రతీ ఒక్కరూ తాము చాలా అందంగా ఉన్నామని అనుకుంటారు. అలా అనుకోవాలి కూడా. లేదంటే ఆత్మన్యూనత భావం పెరిగి పెరిగి అనేక మానసిక రుగ్మతలకి దారి తీయవచ్చు. ఐతే అవతలి వారిని ఆకర్షించడానికి కొన్ని చిట్కాలు పాటిస్తే మీరు మరింత హ్యాండ్ సమ్ గా కనిపిస్తారు. అలాంటి చిట్కాలేంటో ఇక్కడ చూద్దాం.

 

ఎలా కనిపిస్తున్నావు

మనం బయటకి కనిపించే తీరే మనం ఎలా ఉన్నామనేది నిర్దేశిస్తుంది. అందుకే ముఖ సౌందర్యం ముఖ్యం. దీనర్థం ఇక్కడ తెల్లగా ఉండాలనో, కలర్ పెంచుకోవాలనో ఉద్దేశ్యం కాదు. మీ చర్మానికి సరైన సాధనాలు వాడి మెరిసే విధంగా ఉంచుకోవడం. అంటే, మీ వయసుకి తగ్గ రీతిలో మీ చర్మాన్ని కాపాడుకోవాలి. నల్లమచ్చలు, ముడుతలు ఏర్పడకుండా చూసుకోవాలి.

సంవత్సరానికి ఒకసారయినా పళ్ళ డాక్టర్ ని సంప్రదించాలి. పళ్ళని శుభ్రంగా ఉంచుకోవడం అనేది అందంగా కనిపించడంలో అతి ముఖ్యమైన విషయం. ఇవే గాక మనం వేసుకునే బట్టలు, షూసు, మొదలగు వాటిల్లో మీఖు ఏవి సరిపోతాయో చెక్ చేసుకుని మరీ సెలెక్ట్ చేసుకోండి. లైట్ కలర్ దుస్తులని వాడితే లుక్ వేరేలా ఉంటుంది.

నమ్మకం

ఎంత అందంగా రెడీ అయిన వారిలో తమ మీద తమకి నమ్మకం కనిపించకపోతే చాలా వీక్ గా కనిపిస్తారు. అందుకే నీలో నమ్మకాన్ని పెంచుకో. ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవాలంటే ఏం చేయాలో ఆలోచించు. నడుస్తున్నప్పుడు స్ట్రెయిట్ గా నడువు. మాట్లాడుతున్నప్పుడు ఎదుటి వారిని చూస్తూ మాట్లాడు.

అలవాట్లు

కనీసం 8గంటలైనా నిద్రపోవాలి. పొద్దున్న లేవగానే ఒక గ్లాసెడు గోరు వెచ్చని నీళ్ళు తాగాలి. కనీసం అరగంట వ్యాయామం చేస్తే బాగుంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version