మెడ మీద నలుపు పోవాలంటే.. ఇలా చేయండి…!

-

మెడ మీద నలుపు తొలగిపోవాలంటే ఇలా ఈ సింపుల్ చిట్కాలని పాటిస్తే సరిపోతుంది. కొందరు కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు. అటువంటి తప్పులు చేయడం వలన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎండ, కాలుష్యం, హార్మోన్ లో మార్పులు మొదలైన కారణాల వలన కొన్ని రకాల సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఉబకాయం, ఇన్సులిన్ నిరోధకత వలన కూడా మెడ మీద నల్లగా మారిపోతుంది. దీని కారణంగా మెడ నల్లగా అందవిహీనంగా కనిపిస్తూ ఉంటుంది. కానీ ఆ నలుపుని తొలగించడానికి ఈ సింపుల్ చిట్కాలు బాగా ఉపయోగపడతాయి.

సులభంగా మళ్లీ మీ మెడని అందంగా తిరిగి తెచ్చుకోవచ్చు. మరి ఇక మెడ మీద నలుపు ఎలా తొలగిపోవాలనేది చూద్దాం. నారింజ తొక్కలు చర్మానికి చాలా మేలు చేస్తాయి స్టడీ కూడా ఈ విషయాన్ని చెప్తోంది. నారింజ తొక్కలతో పొడి చేసుకునే దానిని మెడకు పట్టిస్తే కచ్చితంగా మెడ మీద ఉండే నలుపు తొలగిపోతుంది. కమల పండ్లు తొక్కలని మీరు పొడి కింద చేసుకుని పాలు కానీ ఆరెంజ్ జ్యూస్ కానీ వేసి పేస్ట్ లాగ చేసుకుని మెడ మీద అప్లై చేసుకుని 10 నుండి 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో మెడని క్లీన్ చేసుకుంటే నలుపు ఫుల్లుగా తగ్గిపోతుంది.

చర్మాన్ని తేమగా మార్చడానికి చర్మంపై నల్ల మచ్చలను తొలగించడానికి ఓట్స్ కూడా బాగా పనిచేస్తాయి. మైదాలో కొంచెం ఓట్స్ వేసి దానిలో టమాట పేస్ట్ చేసుకుని మెడ మీద నలుపు ఉన్నచోట అప్లై చేసుకోండి. 20 నిమిషాల తర్వాత మెడని చల్లటి నీటితో కడిగేసుకుంటే చక్కటి ఫలితం కనబడుతుంది. కలబంద గుజ్జు కూడా బాగా పనిచేస్తుంది కలబంద గుజ్జుని మెడ మీద రాస్తే నలుపు అంతా కూడా ఈజీగా పోతుంది తెల్లగా మీ మారుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news