కళ్లకింద క్యారీబ్యాగ్గులకు కారణం ఏంటి.? తగ్గించుకోవడం ఎలా..?

-

మన ఏజ్‌ ఎంతో.. కళ్లను చూసి కచ్చితంగా కాకపోయినా అందాసుగా చెప్పేయొచ్చు. కళ్లు ఎంత ఆరోగ్యంగా అందంగా ఉంటే.. మన ఏజ్‌ అంత తక్కువగా కనిపిస్తుంది. క్యారిబ్యాగ్‌లు వచ్చేసి, డార్క్‌ సర్కిల్స్‌తో ఇరవైకే అరవై అన్నట్లు ఉంటే.. చూసే వాళ్లు అంతా ఆన్టీ, అంకుల్‌ అనుకుంటారు. ఫేస్‌లో కళ్లది చాలా ముఖ్యమైన పాత్ర. మీరే గమనించండి.. ఎంత తెల్లగా ఉన్నా కళ్లు లోపలికి వెళ్లి నల్లగా, క్యారీబ్యాగ్స్‌ వచ్చేసిన వాళ్లు అందంగా ఉంటారా..? డార్క్‌ సర్కిల్స్‌ తగ్గించుకోవాడనికి ఏం చేయాలో మీరు ఈపాటీకే తెలుసుకుని ఉంటారు..మరీ ఈ బ్యాగ్గుల సంగతేంటి..? అది కూడా చూసేయండి..!

కళ్ల మూలల వద్ద ఏర్పడే ముడతలను ‘క్రోస్ ఫీట్’ అని అంటారు. మన భాషలో క్యారీబ్యాగ్స్‌ అండీ..! ఆ ముడతలు వృద్ధాప్య సంకేతాలను అందిస్తాయి. అక్కడి చర్మం పలుచగా ఉండటం వల్ల మనం నవ్వినప్పుడు, ముఖం చిట్లించినప్పుడు ఆ ప్రాంతంలో ఎక్కువగా ముడతలు, గీతలు ఏర్పడతాయి. వేసవిలో కళ్లకు నేరుగా సూర్య రశ్మి తగలకుండా జాగ్రత్త పడాలి. కనురెప్పలను కప్పి ఉంచేలా సన్ గ్లాసెస్ ధరించాలి.

క్యారీబ్యాగ్స్‌- నిద్రలేమి వల్లే ఈ సమస్యలు ఏర్పడతాయి. రోజు కాకపోయినా వారానికి ఒకటి రెండు సార్లు అయినా కంటినిండా వీలైనంత ఎక్కువ సేపు నిద్రపోయేందుకు ప్రయత్నించండి. కళ్ల కింద ఉండే చర్మంలోకి ద్రవాలు చేరడం వల్ల అక్కడ వాపు లేదా సంచిలా ఏర్పడి కళ్లు ఉబ్బినట్లు కనిపిస్తాయి. ఒత్తిడి, డిప్రెషన్, మద్య తాగడం వల్ల కూడా ఏర్పడుతుంది. కళ్లు ఇలా ఉబ్బినప్పుడు ఐస్, చల్లని నీళ్లను కళ్లకు పెట్టడం ద్వారా కాస్త ఉపశమనం ఉంటుంది. చల్లదనం వల్ల అక్కడ రక్త ప్రవాహం మెరుగై వాపు తగ్గుతుంది. రక్త ప్రవాహం పెరగడం వల్ల ఆక్సిజన్, పొషకాల సరఫరా పెరుగుతుంది. ఫలితంగా అక్కడ పేరుకుపోయిన విషతుల్యాలు తొలగిపోయి ద్రవాల నిల్వ తగ్గుతుంది.

మీకు 40 ఏళ్లు దాటినట్లయితే తప్పకుండా మీ కళ్లను పరీక్షించుకోవాలి. మీకు గ్లాకోమా హిస్టరీ ఉన్నట్లయితే మరింత జాగ్రత్తగా ఉండాలి. డయాబెటిస్ ఉన్నవారు కళ్లమీద ప్రత్యేక శ్రద్ద పెట్టాలి. స్ర్కీన్ టైమ్‌ తగ్గించాలి. ఫోన్‌ వాడేప్పుడు తగినంత బ్రైట్‌నెస్‌ పెట్టుకోవాలి. లైట్స్‌ ఆపేసి అస్సలు స్క్రీన్‌ చూడడం చేయొద్దు. ఇలా చేస్తే కళ్ల మీద ఎక్కువ ఒత్తిడి పడుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version