చేపల పెంపకంలో సరికొత్త విధానం.. ట్యాంకుల్లో చేపలు పెంచి లాభాల పంట పండించండి.

-

కరోనా మహమ్మారి ఉద్యోగాలను ఊచకోత కోసిందనే చెప్పాలి. కరోనా వచ్చాక చాలా ఉద్యోగాలు అడ్రెస్ లేకుండా పారిపోయాయి. దాంతో ఎంతో మంది నిరుద్యోగులయ్యారు. ఈ నేపథ్యంలో సరికొత్త ఉత్పత్తుల కోసం వేట మొదలయ్యింది. చాలా మంది ఉత్సాహవంతులు సరికొత్త ఉపాధి కోసం వేచి చూస్తున్నారు. అలాంటి వారికోసమే అన్నట్టుగా బయోఫ్లాక్ విధానంలో చేపలు పండించడం వరంలా మారింది. ట్యాంకుల్లో చేపలు పండించడం. ఇదేంటి కొత్తగా ఉందనుకుంటున్నారా? కొత్తదే. కానీ చాలా లాభసాటిది.

పీపీజే గ్రూప్ ఛైర్మన్ జాన్ పాల్ ప్రకారం బయోఫ్లాక్ చేపల పెంపకానికి పెద్దగా స్థలం అవసరం లేదు. కేవలం ట్యాంకుల్లోనే వాటిని పెంచొచ్చు. ఒక రైతు తన చిన్న పాటి స్థలంలో కూడా లాభసాటిగా చేపలను పెంచుకోవచ్చు. సాంప్రదాయ పద్దతుల్లో 200చేపలను పెంచుతున్నట్లయితే ఈ సరికొత్త విధానం ద్వారా 2వేల చేపలను పెంచవచ్చు. జాన్ పాన్ మాటల ప్రకారం ట్యాంకు వ్యాసం ఒక మీటరుగా, ఎత్తు 1.20మీటర్లుగా ఉంటే సరిపోతుంది. ఈ ట్యాంకుకి 28వేల నుండి 30వేల దాకా ఖర్చు అవుతుంది.

దీనికోసం రైతులకి కావాల్సిన అన్ని సౌకర్యాలను జాన్ పాల్ బృందం అందజేయనుంది. చేపలకి కావాల్సిన ఆహారం నుండి అన్ని సౌలభ్యాలు ఉంచుతుంది. వాటిని పెంచి పెద్దచేసి వాళ్ళకి తిరిగి అప్పగించాల్సిన బాధ్యత రైతుదే. మార్కెటింగ్ లో కూడా జాన్ పాల్ బృందం పాలు పంచుకుంటుంది. అన్నీ అందించి వాళ్లే తిరిగి కొనుక్కుంటారన్న మాట. ఇదొక్కటే కాదు, దీని కోసం రైతు పెద్దగా స్థలం కోసం వెదకాల్సిన పనిలేదు. ఇంటి డాబా పైన కూడా చేపలని పెంచవచ్చు.

ఇలా పెంచిన చేపలకి కిలోకి 175రూపాయల వరకు చెల్లిస్తున్నారు. ప్రస్తుతానికి 1600 ఔట్ లెట్లు ఓపెన్ చేసారు. పాలక్కడ్ ప్రాంతాల్లో ఇది వేగంగా విస్తరిస్తున్నారు. ఉద్యోగాలు పోయి బాధపడుతున్న యువతకి ఈ ట్యాంకుల్లో చేపల పెంపకం బాగా ఉపయోగపడుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news