వ్యాక్సిన్ వేయించుకున్న మూడో రోజే మంత్రికి కరోనా పాజిటివ్

Join Our Community
follow manalokam on social media

కరోనా వైరస్ సంక్రమించకుండా వ్యాక్సిన్ తీసుకున్న కొద్ది రోజులకే గుజరాత్ రాష్ట్ర మంత్రి ఈశ్వర్సింహ్ పటేల్ కోవిడ్ -19 బారిన పడ్డారు. ఆయనకు ఈరోజు పాజిటివ్ అని తేలింది. నిజానికి ఆయన మార్చి 13 న టీకా వేయించుకున్నారు. ఇక ఇలాంటి కేసులు చాలానే బయట పడుతున్నాయి, దీంతో వ్యాక్సిన్ ఎంత వరకు ఉపయోగకరం అనే చర్చ నడుస్తోంది. మరీ ముఖ్యంగా తెలంగాణలో మంచిర్యాల జిల్లాలో వ్యాక్సిన్ వేయించుకున్న ఎనిమిది మంది కరోనా బారిన పడ్డారు.

vaccine
vaccine

మంచిర్యాల జిల్లాలో కరోనా వ్యాక్సిన్ ఫస్ట్ డోస్ వేయించుకున్న రామకృష్ణాపూర్ ఏరియా ఆస్పత్రి సిబ్బందిలో ఎనిమిది మందికి ఫిబ్రవరి నెలలో కరోనా వైరస్ సోకింది. వీరికి లక్షణాలు కనిపించడంతో టెస్ట్ చేయగా పాజిటివ్ వచ్చింది కరోనా పాజిటివ్ వచ్చిన వారిలో ఇద్దరు డాక్టర్లు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు. అయితే మరి ఇలాంటి ఘటనల నేపధ్యంలో కరోనా వ్యాక్సిన్ మీద జనాల్లో నమ్మకం ఏర్పడుతుందా ? అంటే చెప్పలేని పరిస్థితి. 

TOP STORIES

రెండు మాస్కులు ధరిస్తే కరోనా వ్యాప్తి తక్కువగా ఉంటుందా? నిపుణులు ఏం చేబుతున్నారు?

కరోనా సెకండ్ వేవ్ రోజురోజుకీ తీవ్రరూపం దాలుస్తోంది. ఎప్పుడూ లేని విధంగా ఒక్కరోజులో రెండులక్షలకి పైగా కేసులు వస్తున్నాయి. ముందు ముందు ఇది మరింత పెరిగే...