బిజినెస్‌ ఐడియా: కేవలం రూ.15 వేల పెట్టుబడితో రోజుకు రూ. 4వేలు సంపాదించవచ్చు..!

-

తక్కువ పెట్టుబడితో ఏదైనా వ్యాపారం చేయాలి అనుకుంటున్నారా..? ఏం చేయాలి, ఎలా మొదలుపెట్టాలి అనే సందేహంలో ఉన్నారా..? ఇప్పటికే మనం 3- 50 వేల లోపులో చేయగల బోలెడు లాభసాటి వ్యాపారాల గురించి ఈ సైట్‌లో అందించాం. ఇప్పుడు అలాంటి ఓ బెస్ట్‌ ఐడియాను తీసుకొచ్చాం. కేవలం 15 వేల పెట్టుబడితో రోజుకు రూ. 4 వేలు సంపాదించవచ్చు. ఇంతకీ ఆ బిజినెస్‌ ఏంటంటే.. అరటిపండు పొడి వ్యాపారం.

అరటి పొడిని తయారు చేయడానికి మీకు 2 యంత్రాలు అవసరం. మొదటి యంత్రం అరటిని పొడిగా చేస్తుంది. రెండవది మిక్సర్ యంత్రం. మీరు ఈ యంత్రాలను ఆన్‌లైన్‌లో లేదా మీకు సమీపంలోని ఏదైనా దుకాణం నుంచి కొనుగోలు చేయవచ్చు.

ఎలా ప్రారంభించాలి?

బనానా పౌడర్ చేయడానికి, ముందుగా మీరు పచ్చి అరటిపండ్లను సేకరించాలి. దీని తర్వాత మీరు ఈ అరటిని సోడియం హైపోక్లోరైట్‌తో శుభ్రం చేయాలి. ఇప్పుడు వాటిని పీల్ చేసి వెంటనే సిట్రిక్ యాసిడ్ ద్రావణంలో వేసి 5 నిమిషాలు అలాగే ఉంచాల్సి ఉంటుది. దీని తర్వాత అరటిపండును చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. తర్వాత ఓవెన్‌లో ముక్కలను ఉంచండి. 60° C వద్ద దానికి 24 గంటలు ఉంచండి. దీంతో అరటిపండు ముక్కలు పూర్తిగా ఆరిపోతాయి. ఆ తర్వాత వాటిని మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా పొడి వచ్చేవరకు గ్రైండ్ చేస్తూ ఉండండి.

ఎంత సంపాదించవచ్చు..?

ఇక్కడ చెప్పినట్లు ఖర్చు దాదాపు 10-15 వేల రూపాయల వరకూ అవుతుంది. కానీ సంపాదన మాత్రం దండిగానే ఉంటుంది. అరటిపండుతో తయారుచేసిన పొడిని పాలిథిన్ లేదా గాజు సీసాలో నింపి ఉంచుకోవచ్చు. అరటిపండుతో తయారు చేసిన 1 కిలోల పొడిని మార్కెట్‌లో రూ.800 నుంచి రూ.1000 వరకు సులభంగా విక్రయించవచ్చు. రోజూ 5 కిలోల అరటిపండు పొడి చేస్తే రూ.3500 నుంచి రూ.4500 వరకు లాభం ఆర్జించవచ్చు.

అసలు అరటిపండు పొడితే ఏం చేస్తారు..?

అరటి పొడి ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది బీపీని నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది జీర్ణ శక్తిని బలోపేతం చేయడానికి కూడా ఉపయోగించబడుతుంది. అంతే కాకుండా, ఇది మీ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో కూడా సహాయపడుతుంది. ఈ లక్షణాల కారణంగా, అరటి పొడికి మార్కెట్‌లో డిమాండ్ బాగా ఉంది. అయితే ముందే ఆర్డర్‌ తీసుకోని చేయడం, దగ్గర్లోని షాప్స్‌ వాళ్లతో ఒప్పందం చేసుకోని చేయడం వల్ల మీ బిజినెస్‌ ఇంకా బాగా రన్‌ అవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news