బిజినెస్ ఐడియా: టెర్రస్ గార్డెన్ తో ఇలా సంపాదించచ్చు తెలుసా..?

-

మీరు ఏదైనా మంచి బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా..? అయితే ఈ బిజినెస్ ఐడియా (Business Idea) మీకోసం. ఈ బిజినెస్ చేసి మంచి రాబడి పొందొచ్చు. మరి ఇక ఆలస్యం ఎందుకు ఈ బిజినెస్ ఐడియా గురించి చూసేయండి.

 

Terrace Garden | టెర్రస్ గార్డెన్

ఈ మధ్య కాలం లో చాలా మంది డాబా పైన కూరగాయల మొక్కలు, పండ్ల మొక్కలు, పూల మొక్కలు వంటివి వేసి సాగుచేస్తున్నారు. దీని వల్ల మంచి లాభాలు పొందొచ్చు. ఈ వ్యాపారం చేయడం చాలా ఈజీ కూడా.

ఈ రోజుల్లో కెమికల్స్ లేకుండా పండించే వాటికీ డిమాండ్ ఎక్కువగా ఉంది మీరు కావాలంటే ఈ కామర్స్ సైట్లలో విత్తనాలు కొని వ్యవసాయం మొదలు పెట్టొచ్చు. అదేవిధంగా మీరు పండించే మొక్కల పైన వీడియోలను కూడా తీసి యూట్యూబ్ లో పెట్టొచ్చు. యూట్యూబ్ లో వీడియోలు పెడితే వ్యూస్ ఆధారంగా మీకు డబ్బులు కూడా వస్తాయి.

సాగు చేయడం కష్టమైన పని కానీ అనుకుంటే సులువుగా చేసేయొచ్చు. మీరు దీని కోసం విత్తనాలు, కుండీలు మొదలైన వాటిని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. చాలా మంది టెర్రస్ గార్డెన్ ఏర్పాటు చేసి బిజినెస్ కూడా చేస్తున్నారు.

వ్యవసాయమే కానీ ఇది ఎంతో మోడ్రన్ గా వుంటుంది. నిజంగా కష్టానికి తగ్గ ఫలితం కనబడుతుంది. మీరు ఒకసారి పండించడం ఎలాగ అనేది చూస్తే ఇప్పుడు ఉన్న టెక్నాలజీ లో చాలా విషయాలు మీకు తెలుస్తాయి.

ఆర్గానిక్ ఫార్మింగ్ తెలివిగా చేసి నాలుగు రాళ్ళు వెనకేయ్యచ్చు. కోకో పిట్ వంటివి వాడి మీరు సాగు చేయవచ్చు. స్థానికంగా మంచి డిమాండ్ వుంది కాబట్టి మీరు దీనిని క్యాష్ చేసుకోవచ్చు. ఇలా మంచి రాబడి మీరు పొందొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news