ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్ లపై విమర్శలు చేసిన కేసులో శిక్ష అనుభవిస్తున్న నటుడు పోసాని కృష్ణమురళీ గురించి దాదాపు అందరికీ తెలిసిందే. ఆయనకు నిన్న గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం శ్యామల నగర్ లోని న్యాయమూర్తి ఇంట్లో పోసానిని పోలీసులు హాజరు పరిచారు. పోసాని తరపున మాజీ ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు.
వ్యక్తిగత కోపంతోనే తనపై టీడీపీ అధికార ప్రతినిధి ఫిర్యాదు చేశాడని.. పోసాని జడ్జీ ముందు తెలిపారు. ఈ కేసులో సెక్షన్ 111 వర్తించదని పేర్కొన్నారు. న్యాయమూర్తి ముందు తన వాదనలు వినిపిస్తూ పోసాని బోరున విలపించారు. జడ్జీ సమక్షంలో కన్నీటితో తప్పు చేస్తే.. నరికేయండన్నారు. ప్రస్తుతం నా ఆరోగ్య పరిస్థితి బాగాలేదు. రెండు ఆపరేషన్లు, స్టంట్లు వేశారు. నాకు పెళ్లాం, పిల్లలున్నారని వెల్లడించారు పోసాని. రెండు రోజుల్లో బెయిల్ రాకపోతే ఆత్మహత్యే శరణ్యమని న్యాయమూర్తి ఎదుటే లాయర్లతో పోసాని పేర్కొన్నారు.