మహిళల ప్రీమియర్ లీగ్ 2025లో నేడు కీలక పోరు జరగనుంది. ఎలిమినేటర్ మ్యాచ్లో గుజరాత్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ తలపడనున్నాయి. ముంబైలోని బ్రబోర్న్ స్టేడియంలో రాత్రి 7.30 నుంచి మ్యాచ్ ఆరంభం అవుతుంది. డబ్ల్యూపీఎల్ 2025లో ఇప్పటికే గుజరాత్ పై రెండుసార్లు గెలిచిన ముంబై.. ఎలిమినేటర్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది. అంతేకాదు సొంతగడ్డపై ఆడుతుండడం కూడా ముంబైకి కలిసొచ్చే అంశం. హేలీ మాథ్యూస్, నాట్సీవర్ బ్రంట్, హర్మన్ ప్రీత్ కౌర్, అమేలియా కెర్, యాస్టికా భాటియా వంటి బ్యాటర్లతో ముంబై బ్యాటింగ్ బలంగా ఉంది.
ముఖ్యంగా హేలీ మెరుపు ఆరంభాలను ఇవ్వడమే కాకుండా.. తన ఆఫ్స్పీన్ తో రాణిస్తోంది. సూపర్ ఫామ్ లో ఉన్న నాట్స్వర్ టోర్నీలో ఇప్పటికే నాలుగు అర్ధ శతకాలు చేసింది. ఎనిమిది మ్యాచ్లల 416
పరుగులు చేయడమే కాకుండా.. 8 వికెట్లు పడగొట్టింది. హర్మన్ ప్రీత్ గత మ్యాచ్లో హాఫ్ సెంచరీ చేసి చేసింది. బౌలింగ్ లో అమేలియా కెర్, హేలీ, నాట్స్వీర్ ముంబైకి బలం. ఆష్లీ గార్డ్నర్ సారథ్యంలోని గుజరాత్ ముంబై ని ఓడించడం సవాలే. గార్డ్నర్ 235 పరుగులతో రాణించింది. అయితే
ముంబైతో జరిగిన మ్యాచ్ లో డకౌటైంది. హర్లీన్ డియోల్, బెత్ మూనీ, ఫోబ్ లిచ్ఫీల్డ్, డియాండ్రా డాటిన్ మెరవాలని టీమ్ మేనేజ్మెంట్ ఆశిస్తోంది. గార్డ్నర్ సహా మేఘనా సింగ్, ప్రియా మిశ్రాలు బంతితోనూ రాణించడం కీలకం. ఈ ఎలిమినేటర్లో గెలిచిన టీమ్ ఫైనల్లో ఢిల్లీతో తలపడనుంది. లీగ్ దశ ముగిసేసరికి పట్టికలో అగ్ర స్థానంతో నిలిచిన ఢిల్లీ.. నేరుగా ఫైనల్ కి చేరిన సంగతి తెలిసిందే.