మీరు ఏదైనా బిజినెస్ ని మొదలుపెట్టాలి అనుకుంటున్నారా..? దానితో మంచిగా సంపాదించాలనుకుంటున్నారా..? అయితే మీ కోసమే ఈ బిజినెస్ ఐడియా. ఈ బిజినెస్ ఐడియా ని కనుక మీరు ఫాలో అయ్యారంటే మంచిగా డబ్బులు సంపాదించుకోవడానికి అవుతుంది. ఈ మధ్య కాలం లో చాలా మంది పంటలు పండించి చక్కగా డబ్బులు సంపాదించుకుంటున్నారు. పైగా ఎలాంటి రిస్క్ కూడా దీని వల్ల కలగదు. బొప్పాయి సాగు తో చాలా మంది మంచిగా లాభాలను పొందుతున్నారు.
మరిక ఈ బిజినెస్ గురించి పూర్తి వివరాల్లోకి వెళితే… ప్రపంచ వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఆరు మిలియన్ టన్నుల బొప్పాయి ఉత్పత్తి అవుతుంది. మన దేశంలోనే మూడు మిలియన్ టన్నుల బొప్పాయి ఉత్పత్తి అవుతోంది. మంచిగా బొప్పాయి ద్వారా మనం డబ్బులు సంపాదించుకోవడానికి అవుతుం.ది బొప్పాయి వల్ల ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతుంది పైగా మందులలో కూడా బొప్పాయి ఆకులను, గింజలని వాడుతూ ఉంటారు.
సబ్బులు మొదలైన బ్యూటీ ప్రొడక్ట్స్ కోసం బొప్పాయి పండ్ల ని వాడతారు. డిమాండ్ ఎక్కువగా ఉంది కాబట్టి లాభాలు కూడా బాగా వస్తాయి. బొప్పాయి సాగు వల్ల మీకు ఎటువంటి నష్టం కలగదు. ఈ పంట కోసం మీరు జూలై నుంచి సెప్టెంబర్ లేదా ఫిబ్రవరి-మార్చి నెలల మధ్య విత్తనాలు వేయాలి. ఒక హెక్టార్ లో సాగు చేయడానికి సుమారు లక్ష రూపాయలు ఖర్చవుతాయి.
మీరు మే జూన్ సీజన్ లో నీళ్లు పోయాలి ఇలా ఈ జాగ్రత్తలు తీసుకుంటే మంచిగా బొప్పాయి పండ్లు పండుతాయి. బీహార్ ప్రభుత్వం అయితే ఏకంగా 75 శాతం వరకు సబ్సిడీ ఇస్తోంది. బొప్పాయి చెట్ల ద్వారా మీరు మంచిగా డబ్బులు సంపాదించుకోవడానికి అవుతుంది తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలని మీరు ఈ సాగు చేసే పొందొచ్చు.