బిజినెస్ ఐడియా: ఐస్ క్రీమ్స్ తో అదిరే లాభాలు..!

మీరు ఏదైనా వ్యాపారాన్ని మొదలు పెట్టాలనుకుంటున్నారా..? దాని ద్వారా మంచిగా డబ్బు సంపాదించాలనుకుంటున్నారా అయితే ఈ బిజినెస్ ఐడియా మీ కోసం. ఈ మధ్య కాలంలో చాలా మంది తమకు నచ్చిన వ్యాపారంని చేస్తున్నారు మీరు కూడా మంచి బిజినెస్ చేసి దాని ద్వారా చక్కటి ఆదాయాన్ని పొందాలనుకుంటే ఈ బిజినెస్ ఐడియా మీకు ఉపయోగపడుతుంది. అదే ఐస్ క్రీమ్ బిజినెస్.

ఐస్ క్రీమ్ పార్లర్ ని మొదలు పెట్టి మీరు మంచిగా డబ్బులు సంపాదించుకోవచ్చు దీనిని మొదలు పెట్టాలంటే పది వేల నుంచి 20 రూపాయలు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అలానే ఈ బిజినెస్ చేయాలంటే 300 నుండి 400 చదరపు అడుగుల స్థలం ఉండాలి. అలానే పార్లర్ లో పదిమంది వరకు కూర్చునేలా ఏర్పాటు చేసుకోవడం ముఖ్యం.

మీరు సొంతంగా మొదలుపెట్టచ్చు లేదంటే ఏదైనా కంపెనీ నుండి ఫ్రాంచైజ్ తీసుకోవచ్చు. అయితే ఆహార పదార్థాల నాణ్యత విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఐస్ క్రీమ్ పార్లర్ మొదలు పెట్టాలంటే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి లైసెన్స్ అవసరం.

మీ వద్ద ఉండే ఆహారపదార్థాలు నాణ్యంగా ఉన్నాయా లేదా అని ఎఫ్ఎస్ఎస్ఏఐ నిర్ధారిస్తుంది. చాలా మంది ఎక్కువగా బిజినెస్లను చేయడానికి ఇష్టపడుతున్నారు ఉద్యోగాన్ని కూడా వదులుకుని వ్యాపారాలు చేసి మంచి ఆదాయం సంపాదిస్తున్నారు ఇలా మీరు కూడా ఐస్క్రీమ్ ల ద్వారా తక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువ ఆదాయాన్ని పొందొచ్చు.